Mumbai, December 13: సోషల్ మీడియలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ యూజర్లకు (Whatsapp Users)శుభవార్తను చెప్పింది. ఇకపై మీ మొబైల్ లోని వాట్సప్ కు బల్క్ మెసేజ్ లు రాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వాట్సప్ బిజినెస్ స్పామర్లకు చెక్ పెట్టింది. బిజినెస్ యాప్ ప్లాట్ ఫాంపై స్పామ్ మెసేజ్ పంపే సంస్థలపై ఓ కన్నేసి ఉంచింది. యూజర్లను ఆకర్షించేందుకు అపరిమితంగా బల్క్ మెసేజ్ లు పంపుతూ కంపెనీ టర్మ్స్ ఆఫ్ సర్వీసును ఉల్లంఘించే స్పామర్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటోంది. ఇందుకోసం కంపెనీ కొత్తగా రెండు టూల్స్ క్రియేట్ చేసింది.
వాట్సప్ బిజినెస్ యాప్(WhatsApp Business app), వాట్సప్ బిజినెస్ API ఈ రెండు యాప్స్ ద్వారా బిజినెస్ కంపెనీలు తమ కస్టమర్లతో ఇంటరాక్షన్ అయ్యేలా సహకరిస్తుంది. ఆటోమాటిక్ మెసేజ్ లేదా బల్క్ మెసేజ్ ల కోసం ఈ ప్రొడక్టులను ప్రవేశపెట్టలేదని వాట్సప్((WhatsApp) స్పష్టం చేసింది. ఇలా చేస్తే కంపెనీ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఫేస్ బుక్ సొంత ప్లాట్ ఫాం ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 7, 2019 తర్వాత లేదా అంతకంటే ముందే బల్క్ మెసేజ్, స్పామ్ మెసేజ్ లు పంపిన కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపింది.
ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన అకౌంట్లలో నెలకు రెండు మిలియన్ల అకౌంట్లను బ్యాన్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అందులో 75 శాతం అకౌంట్లలో ఎలాంటి యూజర్ రిపోర్టులు లేవు. ఆన్ ప్లాట్ ఫాంతో వాట్సప్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో సర్వీసును ఆపరేట్ చేసే మిలియన్ల కొద్ది స్పామ్ అకౌంట్లను నిలిపివేశామని కంపెనీ పేర్కొంది. ఈ ప్లాట్ ఫాంపై కంపెనీలు లేదా వ్యక్తిగత యూజర్లు ఎలాంటి లింకులతోనైనా ఉల్లంఘన చర్యకు పాల్పడినట్టు గుర్తిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.