WhatsApp New Feature: ఇంటర్నెట్ లేకున్నా వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు పంపుకోవచ్చు, సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్
whatsapp

ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంట‌ర్నెట్ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను వినియోగ‌దారులు షేర్ చేసుకునే స‌దుపాయాన్ని తీసుకురానుంది. ఈ ఫీచ‌ర్ క‌నుక అందుబాటులోకి వ‌స్తే నెట్‌వ‌ర్క్‌తో సంబంధం లేకుండా డాక్యుమెంట్ల‌ను పంపించుకునే వెసులుబాటు క‌లుగుతుంది.

ఇక మాములుగా నెట్‌వ‌ర్క్ స‌దుపాయం లేకున్నా బ్లూటూత్ సాయంతో క్వీక్ షేర్‌, నియ‌ర్ బై షేర్‌, షేర్ఇట్ వంటి అప్లికేష‌న్ల ద్వారా ఫొటోలు, సినిమాలు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌డం మ‌న‌కు తెలిసిందే. అచ్చం ఇలాంటి త‌ర‌హా స‌ర్వీసుల‌నే ఇప్పుడు వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచ‌ర్‌ను ఎనేబ‌ల్ చేసుకోవాలంటే మాత్రం వాట్సాప్ సిస్ట‌మ్ ఫైల్‌, ఫొటోల గ్యాల‌రీ యాక్సెస్ వంటి అనుమ‌తులు ఇవ్వాల్సి ఉంటుంది. వాట్సప్ నుంచి మరో కొత్త ఫీచర్, యూజర్ల స్టేటస్‌లను నోటిఫికేషన్ల రూపంలో పంపించే ఫీచర్ త్వరలో అందుబాటులోకి

అలాగే మీరు పంపించాల‌నుకుంటున్న వ్య‌క్తి మొబైల్ బ్లూటూత్ క‌నెక్ట్ అయ్యేంత ద‌గ్గ‌ర‌లో ఉంటేనే ఆఫ్‌లైన్ షేరింగ్‌కు వీల‌వుతుంది. బ్లూటూత్ ఆన్ చేసి ద‌గ్గ‌ర‌లోని వాట్సాప్ యూజ‌ర్ ప‌రిక‌రాన్ని గుర్తించి డాక్యుమెంట్ సెండ్ చేయాలి. ఇక అవ‌త‌లి వ్య‌క్తి ప‌ర్మిష‌న్ ఇస్తేనే ఈ త‌ర‌హా షేరింగ్ సాధ్య‌మ‌వుతుంది. వాట్సాప్ ద్వారా వివిధ ర‌కాల ఫైల్స్‌ను పంప‌డాన్ని సుల‌భ‌త‌రం చేసేందుకే ఈ ఫీచ‌ర్‌ను తీసుకువ‌చ్చే యోచ‌న‌లో ఉంది. ఈ మేర‌కు వాట్సాప్‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇచ్చే 'వాబీటా ఇన్ఫో' త‌న బ్లాగ్‌లో తెలియజేసింది. ప్ర‌స్తుతం ఈ ఫీచ‌ర్ బీటా యూజ‌ర్ల‌కు టెస్టింగ్ ద‌శ‌లోనే ఉంది.