మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ లోకి త్వరలో అదిరిపోయే కొత్త ఫీచర్ రానుంది. ఫేస్ బుక్ ఆధ్వర్యంలోని వాట్సాప్ వెబ్ వెర్షన్లో త్వరలో వీడియో/వాయిస్ కాల్ ఫీచర్ ని (WhatsApp Web Video/Voice Call) తీసుకురావాలని భావిస్తుంది. ఈ విషయాన్నీ వాట్సాప్ తన అధికారిక బ్లాగ్ లో ప్రకటించింది.
వాట్సాప్ బ్లాగ్ వాబీట ఇన్ఫో (Wabetainfo) తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం కొంతమంది వాట్సాప్ వెబ్ వెర్షన్ బీటా వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ (WhatsApp New Feature) అందుబాటులో ఉంది. ఇది బీటా వెర్షన్ కావడంతో కొద్దీ మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో మిగతా వాట్సాప్ వెబ్ వెర్షన్ వినియోగదారులందరికి తీసుకురానున్నట్లు పేర్కొంది.
ఈ ఫీచర్ ద్వారా మొబైల్ లో మాదిరిగానే వాయిస్, వీడియో కాల్ బటన్ చాట్ హెడర్‌లో ఉంటుందని చూపించే కొన్ని స్క్రీన్‌షాట్‌లను తన అధికారిక బ్లాగ్ లో షేర్ చేసింది. మీకు వాట్సాప్ వెబ్ నుండి ఏదైనా కాల్ వచ్చినప్పుడు మీకు స్క్రీన్ మీద ప్రత్యేక విండో పాపప్ వస్తుందని తెలుస్తుంది. అలా వచ్చినప్పుడు దాన్ని అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా విస్మరించవచ్చు. మీరు ఎవరకైన కాల్ చేసినప్పుడు ఒక చిన్న పాపప్ వస్తుందని తెలిపింది.
Here's WABetaInfo Tweet
📞 WhatsApp Beta Calls available on WhatsApp Web/Desktop
The roll out is very slow, but some lucky users are starting to receive the feature.
Let me know below if you have received the feature!https://t.co/4EduW4bHfP
— WABetaInfo (@WABetaInfo) December 16, 2020
మీరు కాల్ చేసిన ప్రతి సారి వీడియో కాల్‌ల మాదిరిగానే వీడియో ఆఫ్, మ్యూట్ వాయిస్, రిజెక్ట్ బటన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుతం మీ వాట్సాప్ మొబైల్ వెర్షన్‌లో మాత్రమే వాయిస్ లేదా వీడియో కాల్ ఫీచర్ ఉంది. ఏదైనా కాల్ కోసం మనకు ఇంటర్నెట్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం, వాట్సాప్ గ్రూప్ వాయిస్, వీడియో కాల్స్ లో 8 మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది.