గూగుల్ ఆధారిత లైవ్ స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ నుంచి డిస్‌లైక్ బటన్ కౌంట్‌ను (YouTube will stop showing dislike counts) తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ ఫీచర్‌ను తొలగించే అంశంపై తర్జన భర్జన పడుతున్న యూట్యూబ్.. ఎట్టకేలకు ముందడుగు వేసింది. ఇదిలా ఉంటే యూట్యూబ్‌లో వీడియోపై కొందరు డిస్‌లైక్‌లతో(Dislike Button) దాడులు, వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
ఈ తరుణంలో డిస్‌లైక్ కౌంట్‌ను కనిపించకుండా చేయడం ద్వారా క్రియేటర్స్‌కి, వ్యూయర్స్‌కి మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడుతుందని యూట్యూబ్ (YouTube) ఆశిస్తోంది. ఇక యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్‌కు సైతం డిస్‌లైక్ బటన్ ఉన్నప్పటికీ.. అది కూడా కౌంట్ రూపంలో చూపించదనే విషయం తెలిసిందే!. ఇప్పుడు దానిని మొత్తం అన్ని వీడియోలకు వర్తింప చేసింది. యూట్యూబ్ తాజా నిర్ణయంతో ముఖ్యంగా చిన్న యూట్యూబ్ ఛానెల్స్, యూట్యూబర్స్‌కు ఊరట లభించనుంది.
అలాగే సినిమా వాళ్ల ఫ్యాన్స్ మధ్య డిస్‌లైక్ వార్‌ను చెక్ పడే ఛాన్స్ ఉంది. కొత్తగా ఏదైనా టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగానే యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్లతో కొట్లాడుకుంటారు. తమ ప్రకోపాన్నంతా డిస్‌లైక్‌ల రూపంలో ప్రదర్శించడం చూస్తుంటాం. అయితే యూట్యూబ్ తాజా నిర్ణయంతో కేవలం కౌంట్ మాత్రమే కనిపించదు. డిస్‌లైక్ బటన్ మాత్రం యధాతధంగా ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో, గణాంకాల ద్వారా ఆ కౌంట్‌ను చూసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫీచర్ కనిపించాలంటే యూట్యూబ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రముఖ యూట్యూబర్లు గౌతమి కవాలే, మోహన్ అకా స్లేయ్ మాట్లాడుతూ.. వీడియో ప్రేక్షకులకు నచ్చిందో లేదో తెలుసుకోవడానికి యూట్యూబర్‌లకు డిస్‌లైక్ బటన్ ఒక సూచిక అని తెలిపారు. దీన్ని హైడ్ చేయడం వల్ల వీడియో పై అభిప్రాయాన్ని కోల్పోతామని తెలిపారు. యూట్యూబ్‌లో ఏదైనా వీడియోల కోసం వినియోగదారులు వెతుకుతున్నప్పుడు, వారు ఇష్టాలు-ఇష్టాల నిష్పత్తి ఆధారంగా ఉత్తమమైన వాటిని ఎంచుకుంటారు.
లైక్ టు డిస్‌లైక్ రేషియో ప్రేక్షకులు తమకు నచ్చిన వీడియోలను సర్ఫ్ చేయడానికి సహాయపడుతుంది. ఈ నిష్పత్తి కేవలం వినియోగదారులకు పక్షుల దృష్టిని అందిస్తుందని చెబుతున్నారు డిస్‌లైక్ కౌంటర్ పోవడంతో, “యూట్యూబ్ ఎకోసిస్టమ్‌లో బ్యాలెన్స్ పోతుందని మిత్‌పాట్‌గా ప్రసిద్ధి చెందిన గేమింగ్ కంటెంట్ సృష్టికర్త మిథిలేష్ పాటంకర్ నొక్కిచెప్పారు.
కొంతమంది యూట్యూబర్‌లు డిస్‌లైక్ కౌంట్‌ను దాచడం అనేది చిన్న కంటెంట్ క్రియేటర్‌లకు బూస్ట్ అవుతుందని భావిస్తారు, అయితే మరికొందరు ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ క్రియేటర్ అయిన యష్వీ బగ్గా, డిస్‌లైక్ కౌంటర్‌ను దాచిపెడితే అది “కామెంట్ సెక్షన్‌లో ద్వేషపూరిత కామెంట్లను పోస్ట్ చేయమని ప్రేక్షకులను ప్రోత్సహిస్తుందని నమ్ముతారు.