Mumbai, June 3: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమతమయ్యారు. ఈ నేపథ్యంలోనే వీడియో కాలింగ్ యాప్ లకు బాగా డిమాండ్ పెరిగింది. అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్ యాప్ (ZOOM Cloud Meetings) లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు జూమ్ (ZOOM) సంస్థ తెలిపింది. అయితే టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యతమిస్తు కొత్త అప్‌గ్రేడ్ వర్షన్‌ను ఇన్‌స్టాల్ చేశామని అయితే ఈ వెర్షన్‌ను ఫ్రీగా అందించడంలేదని, రీచార్జ్ చేసుకోవాలని జూమ్ సీఈఓ ఎరిక్ యాన్ తెలిపారు. జియో తాజా ఆఫర్, రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి నాలుగు డిస్కౌంట్ కూపన్లు, జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఆఫర్
త్వరలో ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులతో కలిసి తమ సంస్థ పనిచేయనుందని.. అందువలన ఉచితంగా యూజర్లకు అందించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా యాప్‌ను ఉచితంగా అందించడం వలన కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపారు. తాజా నివేదికల ప్రకారం జూమ్ యాప్ AES 256-bit జీసీఎమ్ అనే కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయనుందని సంస్థ అధికారులు పేర్కొన్నారు.
బ్లూమ్‌బెర్గ్ టెక్నాలజీ జర్నలిస్ట్ నికో గ్రాంట్ ప్రకారం, జూమ్ ఉచిత కస్టమర్లకు అత్యంత భద్రతా లక్షణాలలో ఒకదాన్ని తీసుకురాలేదు, ఇది దాని వినియోగదారుల స్థావరంలో ఎక్కువ భాగాన్ని కూడా కలిగి ఉంది. అయితే దాని ప్రీమియం వెర్షన్ కోసం యూజర్లు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
Here's Zoom’s CEO Statement
Zoom’s CEO says he won’t encrypt free calls so Zoom can work more with law enforcement:
“Free users for sure we don’t want to give that because we also want to work together with FBI, with local law enforcement in case some people use Zoom for a bad purpose,” Yuan said. $ZM
— Nico Grant (@NicoAGrant) June 3, 2020
ఈ కొత్త వర్షన్‌తో అనేక నూతన సాంకేతిక అంశాలను పొందుపరిచామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్‌లెస్ సేవలను యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.