Representative Image (File Image)

Newdelhi, July 12: దేశంలో జననాలరేటును పెంచడానికి రష్యా (Russia) చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్‌ ఆఫ్‌ కరేలియా అధికారులు ఒక బంపర్ ఆఫర్‌ (Bumper Offer) ను ప్రకటించారు. స్థానిక యూనివర్సిటీ, కాలేజీలలో చదివే 25 ఏండ్ల లోపు యువతులు పండంటి బిడ్డను ప్రసవిస్తే వారికి రూ.92 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. సంతానోత్పత్తి రేటును పెంచడానికి ప్రవేశపెట్టే ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల కలకలం.. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని ప్రశ్నించిన పోలీసులు.. గొడ్డలి, రాయితో పోలీసులపై దాడికి యత్నం.. అప్రమత్తమై కాల్పులు జరిపిన పోలీసులు.. ఇద్దరికి గాయాలు

కండోమ్‌ లపై నిషేధం  

మాస్కోటైమ్స్‌ కథనం ప్రకారం.. ఇప్పటికే దేశంలో గర్భనిరోధక సాధనాలైన కండోమ్‌ లు, మాత్రలు తదితర వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా, ప్రతి రష్యా మహిళ 8 మందికి జన్మనివ్వాలని గత ఏడాది డిసెంబర్‌ లో అధ్యక్షుడు పుతిన్‌ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

వీడియో ఇదిగో, సీఐఎస్ఎఫ్ జవాన్‌ను చెంపదెబ్బ కొట్టిన స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి, అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు