45 Bags With Human Body Parts (Photo-AFP)

Mexico police find 45 bags with human body parts: ఉత్తర అమెరికా దేశం మెక్సికో(Mexico)లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. జాలిస్కోలోని ఓ లోయలో మానవ శరీర భాగాలతో కూడిన దాదాపు 45 బ్యాగులు లభించాయని అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి విచారణ జరుపుతోన్న సమయంలో ఈ దారుణం వెలుగుచూసింది. అందులో స్త్రీ, పురుషులకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద పారిశ్రామిక కేంద్రమైన గ్వాడలజారా శివారు ప్రాంతమైన జపోపాన్‌ మున్సిపాలిటీ వద్ద ఓ 40 మీటర్ల లోయలో ఈ భయానక ఘటన వెలుగు చూసిందని తెలిపారు.

స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జాలిస్కో రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాడలాజారాకు దగ్గర్లోని ఒక లోయలో 45 బ్యాగుల మానవ శరీరభాగాలు బయటపడ్డాయి. అవి స్త్రీ, పురుషుల శరీర భాగాలని స్టేట్ ప్రాసిక్యూట్ ఆఫీస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే 20న దాదాపు 30 ఏళ్ల వయసు ఉన్న ఏడుగురు యువతీయువకులు కనిపించకుండా పోయారు. వారి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వారంతా ఒకే కాల్‌ సెంటర్‌(Call center)లో పనిచేస్తున్నారు. అయితే వారి మిస్సింగ్ కేసులు మాత్రం వేర్వేరు రోజుల్లో నమోదయ్యాయి.అయితే మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతంలోనే కాల్‌సెంటర్‌ కూడా ఉంది.

సూడాన్ అంతర్యుద్ధం, ఆకలితో అలమటించి 40 మంది చిన్నారులు మృతి, 280 మంది చావు బతుకుల్లో, దారుణ వీడియోలు బయటకు

పోరెన్సిక్‌ నిపుణులు భాదితులు సంఖ్య, గుర్తింపును వెల్లడించాల్సి ఉంది. కాల్‌ సెంటర్‌లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ కాల్‌ సెటర్‌ వద్ద మాదక ద్రవ్యాలు, రక్తపు మరకలతో కూడిన వస్తువులు, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు లభించినట్లు తెలిపారు. ఐతే బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం వారిని నేరస్తులుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని మండిపడుతున్నారు. కాగా ఆ శరీరభాగాలు ఎవరివనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

నమీబియాలో ఘోర విషాదం, ఇంట్లో తయారుచేసిన గంజి తాగి 13 మంది మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం

ఇదిలా ఉండగా, జాలిస్కాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తొలిసారి కాదు. 2021లో, జాలిస్కోలోని తోనాలా మునిసిపాలిటీలో, 11 మంది మానవ అవశేషాలతో 70 బ్యాగులు బయటపడ్డాయి. అంతకుమునుపు 2019లో జపోపాన్‌లోని జనావాసాలు లేని ప్రాంతంలో 119 బ్యాగుల్లో 29 మంది మానవ అవశేషాలను కనుగొన్నారు. ఇక 2018లో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసు(Missing Case) దేశంలో తీవ్ర నిరసనకు దారితీసింది. వారి శరీర అవశేషాలను యాసిడ్‌ పోసి కరిగించడమే అందుకు కారణం. ఇలా అక్కడ వేల సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితికి అక్కడి డ్రగ్స్ మాఫియానే కారణంగా కనిపిస్తోంది.