Representational Image. | (Photo Credits: Pixabay)

UAE, March 03: కళ్లముందే మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా...కొందరు ఫోన్లలో వీడియోలు(Taking Videos) తీస్తూ, వాటిని సోషల్ మీడియాలో (Social Media) పెట్టి లైక్‌ల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటివారికోసం కొత్త రూల్ వచ్చింది. ఇక నుంచి ప్రమాదాల్లో గాయపడ్డవారిని గానీ, చనిపోయిన వారిని గానీఈ వీడియోలు లేదా ఫోటోలు తీస్తే కఠినంగా శిక్షించే చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఇది మన దేశంలో కాదు, చట్టాలను అత్యంత కఠినంగా అమలు చేసే యూఏఈలో ఈ కొత్త చట్టం తీసుకువచ్చారు. ఇకనుంచి ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాయపడినవారి ఫోటోలు గానీ..చనిపోయినవారి ఫోటోలు తీసినా. వీడియోలు తీసినా జైలుకే (Jail) అని వార్నింగ్ ఇచ్చింది దుబాయ్(Dubai) ప్రభుత్వం. భారీ జరిమానా కూడా తప్పదంటూ వార్నింగ్ ఇచ్చింది యూఏఈ ప్రభుత్వం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడ్డ వాళ్లను, చనిపోయినవాళ్లను వీడియోగానీ, ఫొటోలుగానీ తీస్తే కఠినంగా శిక్షించే చట్టాని తీసుకొచ్చింది.ఈ రూల్ అతిక్రమించి ఎవరన్నా ఇలా చేస్తే జైలుకెళ్లటం ఖాయం అని హెచ్చరించింది. జైలు శిక్షతో పాటు లక్షా యాభై వేల దుబాయ్‌ దిర్‌హం (UAE Dirham) నుంచి ఐదు లక్షల దిర్‌హంల దాకా జరిమానా తప్పదని హెచ్చరించింది. లేదంటే ఆరు నెలల జైలు శిక్ష(Six Months Jail). ఒక్కోసారి రెండూ విధించనున్నట్లు యూఏఈ సైబర్‌క్రైమ్‌ చట్టానికి సవరణ తీసుకొచ్చింది.

Ukraine Russia War: ఈయూ పార్ల‌మెంటు కీలక ప్రకటన, ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం, పోరాటంలో ఎంత‌దాకా అయినా వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపిన జెలెన్‌స్కీ

జనవరి 2, 2022 నుంచే ఈ కొత్త చట్టం (New Law) అమలులోకి వచ్చిందంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నేరాలకు సంబంధించి గానీ..ఆయా ప్రమాదాలకు సంబంధించి గానీ సాక్ష్యాల సేకరణలో అధికారులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ఫొటోలు, వీడియోలు తీయడం, వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడం,ఫార్వార్డ్‌ చేయడం.. ఏదీ మంచిది కాదనే ఈ చట్టం తీసుకొచ్చాం అని చెబుతున్నారు దుబాయ్ (Dubaiఅధికారులు.

Russia-Ukraine Conflict: రష్యాకు అమెరికా వార్నింగ్, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని వెల్లడి, అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించిన అగ్రరాజ్యం

అంతేకాదు..ఎవరినన్నా ఫోటో తీయాలంటే వారి అనుమతిని తప్పనసరి చేసింది.అనుమతులు లేకుండా వ్యక్తుల ఫొటోలు, వీడియోలు తీయడంపై కూడా కొరడా ఝుళిపించేందుకు చట్టాలన్ని మరింత కఠినం చేసింది. ఈ రూల్స్ అతిక్రమిస్తే సంత్సరం జైలు శిక్షతో పాటు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల దాకా దిర్‌హం జరిమానా, లేదంటే రెండూ విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ఇంటర్నెట్‌లో వెంటాడి.. వేధించే నిందితుల (డిజిటల్‌ స్టాకర్స్‌ )కు ఆరు నెలల జైలు శిక్ష, 1 లక్షా 50 వేల నుంచి ఐదు లక్షల దిర్‌హం దాకా జరిమానా లేదంటే రెండూ విధించనుంది దుబాయ్ ప్రభుత్వం.