Kabul, August 16: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. తాలిబన్ల చేతుల్లోకి దేశం వెళ్లడంతో అక్కడ పరిపాలన అంతా అస్తవ్యస్తంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్, భారత ఎంబసీ వద్ద ఇప్పటికీ 200 మందికిపైగా భారతీయులు (Over 200 Indians, Including Staff) చిక్కుకుపోయారు. వాళ్లను రక్షించడానికి అక్కడికి వెళ్లిన విదేశాంగ శాఖ సిబ్బంది, పారామిలిటరీ సైనికులను కూడా అక్కడే (Still Inside Kabul Embassy) ఉండిపోయారు. ఇప్పుడు వారిని వెనక్కి తీసుకురావాల్సి ఉంది. ఇక వీళ్లను తీసుకొచ్చే విమానం కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంది.
ఇక తాలిబన్లు కాబూల్‌లో కర్ఫ్యూ విధించడంతో భారత ఎంబసీ నుంచి వాళ్లను ఎయిర్‌పోర్ట్ వరకూ ఎలా తీసుకురావాలో అంతుబట్టడం లేదు. ఇండియన్ ఎంబసీలోని వారికి రక్షణగా వెళ్లిన 100 మంది ఐటీబీపీ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కాబూల్ ఎయిర్‌స్పేస్‌ను వాణిజ్య విమానాల కోసం మూసివేశారు.
విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమైన కేబినెట్ సెక్రటరీ ఆఫ్ఘన్‌లో చిక్కుకుపోయిన వారిని ఎలా వెనక్కి తీసుకురావాలన్నదానిపై ప్రణాళిక రచించనున్నారు. దేశం నుంచి ఎలాగైనా బయటపడాలని భావిస్తున్న వేల మంది ఆఫ్ఘన్ పౌరులు.. అక్కడి కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తుతున్నారు. రన్‌వేపై కనిపించిన ప్రతి విమానం వెంటా పరుగులు పెడుతున్నారు. ఏ విమానం కనిపిస్తే అందులో ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడి అధికారులు.. కాబూల్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేశారు.
ఇక తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన ఆప్ఘనిస్థాన్‌లోని (Afghanistan Crisis) ఓ గురుద్వారలో 200 మందికి పైగా సిక్కులు చిక్కుకుపోయారని, వారితో పాటు ఆప్ఘనిస్థాన్‌లో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న భారతీయులను తక్షణమే వెనక్కి తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను (Union Foreign Minister S. Jaishankar) పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (Punjab CM Captain Amarinder Singh) కోరారు. అమెరికన్ మిలటరీ విమానంలోకి భయంతో చొచ్చుకుపోయిన అక్కడి ప్రజానీకాన్ని నిలువరించేందుకు అమెరికా బలగాలు కాల్పులు జరిపాయన్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రికి కెప్టెన్ అమరీందర్ తాజా విజ్ఞప్తి చేశారు.
Here's Capt.Amarinder Singh Tweet
Urge @DrSJaishankar, MEA, GoI, to arrange for immediate evacuation of all Indians, including around 200 Sikhs, stuck in a Gurudwara in Afghanistan after the #Taliban takeover. My govt is willing to extend any help needed to ensure their safe evacuation. @MEAIndia
— Capt.Amarinder Singh (@capt_amarinder) August 16, 2021
ఆప్ఘనిస్థాన్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి (Kabul airport) చేరుకుని క్యూలు కట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే స్పందించిన అమరీందర్ సింగ్ కేంద్ర మంత్రికి విజ్ఞాపనలు చేయడంతో పాటు అక్కడి సిక్కులతో పాటు, భారతీయులను ఖాళీ చేయించి స్వదేశానికి రప్పించే విషయంలో చేతనైన సహాయాన్ని అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాజా పరిణామాలపై అమరీందర్ ఆదివారంనాడు కూడా స్పందిస్తూ, జరుగుతున్న పరిణామాలు ఎంతమాత్రం మంచివి కావని, మన సరిహద్దుల్లో అదనపు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు.