Afghanistan Crisis: బయటపడుతున్న తాలిబన్ల క్రూరత్వం, మహిళలు, పిల్లలపై దాడులు, ఆఫ్ఘన్ జెండా ఉంచాలన్న నిరసనకారులపై కాల్పులు, ప్రఖ్యాత అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను తగలబెట్టిన తాలిబన్లు
Taliban (representational Image/ Photo Credit: PTI)

Kabul, August 18: ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు తమ గత క్రూరత్వాన్ని బయటపెడుతున్నారు. ఆప్ఘాన్ కార్యాలయాలపై ఆఫ్ఘన్‌ జెండాను ఉంచాలని డిమాండ్‌ చేస్తూ ఆ దేశ జాతీయ జెండాతో నిరసన తెలిపిన వారిపై కాల్పులు (Taliban opens fire at protesters ) జరిపారు. జలాలాబాద్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది.

ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ల జెండా బదులు ఆఫ్ఘనిస్థాన్‌ జెండాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ జలాలాబాద్‌లో కొందరు (Afghan flag atop offices) బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆఫ్ఘన్‌ జెండాతో (Afghan flag) నిరసన తెలిపారు. దీంతో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులు జరిపారు. తాలిబన్ల జెండాను (Taliban's flag) చూపిస్తూ వారిపై విరుచుకుపడ్డారు. నిరసనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను కూడా కొట్టారు.

ఈ ఘటన నేపథ్యంలో నిరసనకారులు భయంతో పరుగులుతీశారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారని ఆ దేశ లోకల్ మీడియా తెలిపింది.ఇక ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇటీవల ఐస్‌క్రీమ్‌లు తింటూ, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఆట‌లాడుతూ, జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ ఎంతో ఉల్లాసంగా గ‌డిపిన వీడియోలు బయటకు వచ్చిన సంగతి విదితమే.

ఇంకా మా బిడ్డలు బలవ్వాలా..అమెరికా ప్రజలపై దాడి చేస్తే తాలిబన్లకు వినాశనమే, అమెరికా-నాటో దళాల ఉపసంహరణ సరైన నిర్ణయమేనని తెలిపిన జోబైడెన్, తప్పంతా ఆప్ఘనిస్తాన్ సైనికులదేనని తెలిపిన అగ్రరాజ్య అధినేత

తాజాగా అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను తగలబెట్టారు. షెబెర్‌ఘన్‌ ప్రావిన్స్‌ బేఘాలోని బోఖ్ది అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌కు రాత్రి వేళ నిప్పుపెట్టి దగ్ధం చేశారు. మరోవైపు ఈ వినోద పార్క్‌ను తగలబెట్టడాన్ని తాలిబన్లు సమర్థించుకున్నారు. అమ్యూజ్‌మెంట్‌ పార్కు లోపలున్న విగ్రహాలు, బొమ్మలు ఇస్లామిక్ ఆచారాలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. కాగా, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ మంటల్లో కాలిపోతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Here's Bokhdi Amusement Park Fire

ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఆఫ్ఘ‌నిస్తాన్‌లో బ్యూటీ సెలూన్లు తమ షాపుల్లో ఉన్న ఆడ‌వాళ్ల బొమ్మ‌ల‌ను తీసివేస్తున్నాయి. తాలిబ‌న్లకు భ‌య‌ప‌డిన షాపు ఓన‌ర్లు.. త‌మ సెలూన్ల‌లో ఉన్న అమ్మాయిల ఫోటోల‌ను రంగుల‌తో క‌ప్పేస్తున్నారు. ఆఫ్ఘ‌న్ ఆడ‌వారి కోసం ష‌రియ‌త్ చ‌ట్టాల‌ను అమ‌లు చేయనున్న‌ట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సెలూన్లు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఆడ‌వాళ్ల‌పై క‌ఠిన ఆంక్ష‌లు విధించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త‌గానే సెలూన్ ఓన‌ర్లు త‌మ షాపుల్లో ఉన్న చిత్రాల‌ను మార్చేస్తున్నారు.

Here's removing pictures of women

మ‌హిళ‌ల హ‌క్కుల‌ను గౌర‌విస్తామ‌ని, ప్ర‌భుత్వ ఉద్యోగాల్లోకి కూడా వాళ్లను ఆహ్వానిస్తామ‌ని తాలిబన్లు ప్రకటించినప్పటికీ కాబూల్‌లో ప‌రిస్థితి మాత్రం మ‌రోలా ఉంది. ఎలాగైనా దేశం వ‌దిలి వెళ్ల‌డానికి కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు వ‌స్తున్న మ‌హిళ‌లు, పిల్ల‌ల‌పై తాలిబ‌న్లు దారుణంగా దాడికి పాల్ప‌డుతున్న ఫొటోలు, వీడియోలు భ‌యాన‌కంగా ఉన్నాయి. ప‌దునైన ఆయుధాల‌తో వారిపై దాడి చేస్తున్నారు. అంతేకాదు వారిపై ఫైరింగ్ కూడా జ‌రుపుతున్నారు.

Here's Fire Updates

దీనికి సంబంధించిన కొన్ని ఫొటోల‌ను లాస్ ఏంజిల్స్ టైమ్స్ రిపోర్ట‌ర్ మార్క‌స్ యామ్ పోస్ట్ చేశారు. తాలిబ‌న్ల దాడిలో ప‌లువురు గాయ‌ప‌డిన‌ట్లు ఆయ‌న చెప్పారు. మాజీ ప్ర‌భుత్వ ఉద్యోగులను వెతుకుతూ.. కాబూల్ వీధుల్లో తుపాకుల‌తో స్వేచ్ఛ‌గా తిరుగుతున్న తాలిబ‌న్లు కాల్పులు జ‌రుపుతున్నారు. ఇక త‌ఖార్ ప్రావిన్స్‌లో ఓ మ‌హిళ బుర్కా లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని కాల్చి చంపారు. ఆగ‌స్ట్ 1 నుంచే ఆఫ్ఘ‌నిస్థాన్‌లో వెయ్యి మందికిపైగా పౌరుల తాలిబ‌న్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఐక్య రాజ్య స‌మితి వెల్ల‌డించింది.