Kabul Airport Attack Row: 24 గంటల్లో కాబూల్ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి, కచ్చితమైన సమాచారం ఉందని తెలిపిన అమెరికా అధ్యక్షుడు, విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని హెచ్చరికలు జారీ
US President Joe Biden

Washington August 29: కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి (Kabul airport attack) జరిపి వందల మంది ప్రాణాలను తీసుకున్న సంగతి విదితమే. అయితే తాజాగా రానున్న 24 నుంచి 36 గంటల్లో కాబుల్‌ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి (Kabul Airport Attack Row) జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రకటించారు. ఈ మేరకు తమకు కచ్చితమైన సమాచారం లభించిందని తెలిపారు. సైనిక కమాండర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని అఫ్గాన్‌లో ఉన్న అమెరికా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.

ఆప్ఠాన్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా భయానకంగానే ఉన్నాయి. కాబుల్‌ విమానాశ్రయంపై ఉగ్రదాడి జరిగే అవకాశాలు (Another Attack at Kabul Airport ) ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. రానున్న 24-36 గంటల్లో మరో దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని కమాండర్లు నా దృష్టికి తీసుకొచ్చారని బైడెన్ శనివారం తెలిపారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో ఉన్న సైనికులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బైడెన్ సైనిక ఉన్నతాధికారులను ఆదేశించారు.

అలాగే అఫ్గాన్‌లో ఉన్న అమెరికా పౌరులను రక్షించేందుకు కావాల్సిన అన్ని వసతులు, సహకారాలను అందించాలని సూచించారు. గురువారం నాటి దాడులకు కారణమైన ఐసిస్‌-కె పై మరిన్ని దాడులు జరుగుతాయని తేల్చి చెప్పారు. అమెరికాకు హాని తలపెట్టాలనుకుంటున్న వారిపై తప్పకుండా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. కాబుల్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నప్పటికీ తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని బైడెన్‌ ప్రకటించారు. ఇంకా దాదాపు 350 మంది అమెరికా పౌరులు ఇంకా అఫ్గానిస్థాన్‌లో ఉన్నారని తెలిపారు. అలాగే పౌర ప్రభుత్వంతో అమెరికా సేనలకు సహకరించిన అనేక మంది అఫ్గాన్‌ పౌరులు దేశాన్ని వీడేందుకు వేచి చూస్తున్నారన్నారు. శుక్రవారం 6,800 మందిని అఫ్గాన్‌ నుంచి తరలించామన్నారు.

ఉగ్రవాద సంస్థపై అమెరికా వేట, ఐసిస్ శిబిరాలే ల‌క్ష్యంగా డ్రోన్‌ల‌తో విరుచుకుపడిన అగ్రరాజ్యం, ఎయిర్‌పోర్ట్‌ బయట సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు

ఇదిలా ఉంటే అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడికి సూత్రధారిగా ఉన్న ఉగ్రవాది సహా ఇద్దరు కీలక ముష్కరుల్ని అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. ఆ దేశం వెలుపలి నుంచి డ్రోన్లతో అఫ్గాన్‌ నాంగహార్‌ ప్రావిన్సులో దాడికి పాల్పడి ఇస్లామిక్‌ స్టేట్‌-ఖోరాసాన్‌ (ఐ.ఎస్‌.-కె) నేతను తుద ముట్టించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ తెలిపారు.ప్రాథమిక సమాచారం ప్రకారం.. డ్రోన్‌ దాడిలో అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. దాడుల సూత్రధారిని, దానితో ప్రమేయం ఉన్న మరొకరిని సంహరించాం. ఇంకొకరు గాయపడ్డారు. సాధారణ పౌరుల ప్రాణాలకు ఎలాంటి అపాయం వాటిల్లలేదు’ అని వివరించారు.

అయితే ఐ.ఎస్‌-కె సూత్రధారి గురువారం నాటి దాడుల్లో పాల్గొన్నదీ లేనిదీ వెంటనే స్పష్టం కాలేదు. అఫ్గాన్‌లో పేలుళ్ల తర్వాత అమెరికా ఇలాంటి ప్రతీకార దాడికి పాల్పడడం ఇదే తొలిసారి. కాబుల్‌ విమానాశ్రయం వెలుపల దాడికి పాల్పడినవారిని ఈ భూమ్మీద బతకనిచ్చేదే లేదని బైడెన్‌ విస్పష్టంగా చెప్పారని శ్వేతసౌధం పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్‌సాకి విలేకరుల సమావేశంలో తెలిపారు. విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులకు దిగిన ముష్కరులు ఆ తర్వాత కాల్పులకు పాల్పడడం వల్ల ప్రాణనష్టం మరింత పెరిగిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్, 72 మంది దుర్మరణం మరియు వంద మందికి పైగా గాయాలు, తామే జరిపినట్లు ప్రకటించిన ఐఎస్, వెంటాడి.. వేటాడి పగ తీర్చుకుంటామన్న యూఎస్

ఉగ్రవాదులుపెద్దఎత్తున మారణహోమానికి పాల్పడిన నేపథ్యంలో అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబన్లు మరింత పట్టు బిగించారు. మరోసారి దాడి జరిగే అవకాశాలున్నాయన్న సమాచారం నేపథ్యంలో విమానాశ్రయానికి పెద్దఎత్తున ప్రజలు రాకుండా నిలువరించడంపై దృష్టి సారించారు. విమానాశ్రయ మార్గాల్లో మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. చీకట్లోనూ దృశ్యాలు కనిపించేందుకు.. అఫ్గాన్‌ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రత్యేక కళ్లద్దాలను వారు వినియోగిస్తున్నారు. 2 వారాలుగా జనసమ్మర్దంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే అమెరికా బలగాల ఉపసంహరణకు గడువు ఈ నెల 31 కావడంతో పలువురిలో ఆందోళన పెరిగిపోతోంది. ‘‘అమెరికా పాస్‌పోర్ట్‌ ఉన్నవారినే పంపాల్సిందిగా అమెరికా వర్గాలు చెప్పినట్లు తాలిబన్లు స్పష్టంచేశారు. భవితపై బెంగగా ఉందని అమెరికా సైన్యానికి అనువాదకుడిగా వ్యవహరించిన అఫ్గాన్‌ వ్యక్తి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సైనిక బలగాల తుది దశ ఉపసంహరణను అమెరికా ప్రారంభించింది. చనిపోయిన 13 మంది తమ సైనికుల మృతదేహాలను అమెరికాకు తరలిస్తున్నట్లు పెంటగాన్‌ తెలిపింది.

తాలిబన్లు ఎంతటి క్రూరులంటే..మహిళలను చంపి ఆ శవంతో సెక్స్ చేస్తారు, ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను వారి సుఖం కోసం పంపాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన అఫ్గనిస్తాన్‌ మహిళ

గత రెండువారాల్లో అమెరికా నేతృత్వంలో దాదాపు 1.12 లక్షల మందిని వివిధ దేశాలకు తరలించినా ఇంకా కొన్ని వేల మంది తమవంతు కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం లోగా వారి ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది సందేహమే. తగిన పత్రాలు ఉన్నవారిని విమానాశ్రయం లోపలకు ఇప్పటికీ అనుమతిస్తున్నామని, దాదాపు 5,400 మంది ప్రజలు ప్రస్తుతం టెర్మినల్‌ భవనంలో నిరీక్షిస్తున్నారని అమెరికా వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో ఉన్న అఫ్గాన్లను తరలించే చర్యల్ని ముమ్మరం చేయాలంటూ ఇప్పటివరకు 28 మంది సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు లేఖలు రాశారు. అవసరమైతే వీసా నిబంధనల్ని సడలించాలని వారు సూచించారు.

ఇక అఫ్గాన్‌లో మోహరించిన తమ బలగాల్ని ఫ్రాన్స్‌ పూర్తిగా వెనక్కి తీసుకుంది. అమెరికా సేనలు వెళ్లిపోయిన తర్వాత ఎవరైనా అఫ్గాన్‌ను వీడిపోవాలంటే దానికి వీలుగా వాణిజ్య విమానాలను అనుమతిస్తామని తాలిబన్లు చెబుతున్నా వారి నియంత్రణలోని విమానాశ్రయానికి వచ్చేందుకు ఏ విమానయాన సంస్థ అయినా ముందుకు వస్తుందా అనేది అనుమానంగానే ఉంది. తమ పౌరుల్ని అఫ్గాన్‌ నుంచి తరలించే పనిని ముగించినట్లు బ్రిటన్‌ ప్రకటించింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో కో ఎడ్యుకేషన్ రద్దు చేసిన తాలిబన్లు, అబ్బాయిల క్లాసులో అమ్మాయిలు ఉండకూడదని ఆంక్షలు, పశువులతో కామవాంఛ తీర్చుకోవాలన్న తాలిబన్లు, వేశ్యా గృహాల్లో స్త్రీల స్థానంలో జంతువులు, మండిపడుతున్న జంతు పరిరక్షణ సంఘాలు

అందరినీ తీసుకురావడం వీలు కాదని, తరలింపు క్రమంలో అనేకసార్లు తన కళ్లు చెమ్మగిల్లాయని బ్రిటన్‌ రక్షణ దళాల అధిపతి జనరల్‌ సర్‌ నిక్‌ కార్టర్‌ చెప్పారు. క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం ఎంతో సవాల్‌తో కూడుకునేదని వివరించారు. చిట్టచివరి విమానం అక్కడి నుంచి వస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉద్వేగాన్ని కలిగిస్తోందన్నారు.

అఫ్గాన్‌లో కరవు కారణంగా 70 లక్షల మంది ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. ప్రతి ముగ్గురు అఫ్గాన్లలో ఒకరికి అత్యవసర ఆహార సాయం అందించాల్సి ఉందని పేర్కొంది. కరోనా వైరస్‌కు తోడు, ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వల్ల అఫ్గాన్లకు తీవ్ర ఇక్కట్లు తప్పవని రోమ్‌ కేంద్రంగా పనిచేసే ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) పేర్కొంది. ‘‘గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యవసాయ ఉత్పత్తులు 20% తగ్గుతాయి’’ అని ఎఫ్‌ఏవో అంచనా వేసింది.