Shia Mosque Blast: మరోసారి బాంబులతో దద్దరిల్లిన తాలిబన్ల రాజ్యం, కాందహార్‌ షియా మసీదులో భారీ పేలుడు, తునాతునాకలైన ముస్లింల శరీర భాగాలు
Bomb Blast At Tirupati (Representational Image)

Kandahar, October 15: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు (Blast in Afghanistan) సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో కాందహార్‌లోని షియా మసీదులో భారీ పేలుడు (Shia Mosque Blast) సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 7 మంది మరణించగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రార్థనల్లో ఉన్న ముస్లింలు ఈ పేలుడులో ( Blast in Kandahar) తునాతునకలైపోయారు. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా ఆఫ్ఘనిస్థాన్‌లో గత కొద్ది రోజుల నుంచి బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా షియా ముస్లింలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. షియా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే మసీదుల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడడం ద్వారా వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు. ఈ నెల 8న ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే ఈసారి కాందహార్ బాంబు దాడితో దద్దరిల్లింది. దక్షిణ ప్రావిన్స్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్-1 (పీడీ-1) సమీపంలో ఇమామ్ బార్గా మసీదులో ఈ భారీ పేలుడు సంభవించింది.

తాలిబన్ల మరో అరాచకం, ఆప్ఘాన్లో సోమ్‌నాథ్ ఆల‌యంలోని విగ్ర‌హం ధ్వంసం, ఆ స్థానంలో మ‌హ్మ‌ద్ ఘజినీ ద‌ర్గాను పున‌ర్నిర్మిస్తామ‌ని వెల్లడి

మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల సంఖ్యపై అధికారులు ఇప్పటి వరకు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు. పేలుడుకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించలేదు. తాలిబన్లు ఆప్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తరువాత అక్కడ ఇస్లామిక్ స్టేట్ ముఠా దాడులు పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలోనూ అనేకసార్లు షియాలపై ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి.