అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగో పట్టణంలో సోమవారం ఓ దుండగుడు ఇష్టం వచ్చినట్లుగా జరిపిన కాల్పుల్లో కనీసం ఆరుగురు (Six Killed) మరణించగా, దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కచ్చితమైన మరణాల సంఖ్యను అధికారులుఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. హైల్యాండ్ పార్క్‌లో జూలై 4 పరేడ్ జరుగుతున్న సందర్భంగా (4th of July Parade in Highland Park) ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. ఉదయం 10 గంటలకు పరేడ్ ప్రారంభమైంది. తుపాకీ శబ్ధంతో 10 నిమిషాల తర్వాత కార్యక్రమం నిలిచిపోయింది. జైలులో ఖైదీల మధ్య ఘర్షణ, 51 మంది మృతి, 24 మందికి గాయాలు, నైరుతి కొలబియాలోని తులువా జైలులో విషాద ఘటన
దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పరేడ్‌కు వచ్చిన వందలాది మంది ప్రాణాలు (Dozens Injured) అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. 20-25 సార్లకు పైగా కాల్పుల శబ్ధాన్ని తాను విన్నానని మైల్స్ జెరెమ్‌స్కీ అనే ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు. అమెరికాలోని చికాగోలో జూలై 4 పరేడ్‌ను టార్గెట్ చేస్తూ 22 ఏళ్ల దుండగుడు రాబర్ట్ క్రిమో కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో చేజ్ చేసి మరీ నిందితుడు క్రిమోను పట్టుకున్నారు. అతని వద్ద ఆయుధాలు ఉన్నాయని, ప్రమాదకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్రిమో తన ప్రొఫైల్‌లో మ్యూజిషియన్ అని చెప్పుకున్నాడు.