చైనాలో ఈ రోజు జరిగిన విమాన ప్రమాదంకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. చైనా ఏవియేషన్ రివ్యూ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోలను (China Plane Crash) పోస్టు చేసింది. విమానం వేగంగా కిందికి దూసుకురావడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, విమానం కూలిన ప్రదేశం వీడియోను కూడా షేర్ చేసింది. 133 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానం దక్షిణ చైనాలోని పర్వత ప్రాంతంలో కుప్పకూలింది.
విమానం ఎత్తు, వేగంలో అకస్మాత్తుగా తగ్గుదల కనిపించగా.. ఆ వెంటనే నిట్టనిలువగా విమానం కిందికి దూసుకురావడం ఈ వీడియోలో రికార్డైంది. ఫ్లైట్ ట్రాకర్ ‘ఫ్లైట్ రాడార్ 24’ ప్రకారం.. క్రాష్ అయిన విమానం ఎంయూ5735 వేగం తగ్గినట్టు చూపించింది. అలాగే, విమానం 376 నాట్ల వేగం ప్రయాణిస్తూ 3,225 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానాన్ని ట్రాక్ చేసే సామర్థ్యాన్ని వెబ్‌సైట్ కోల్పోయింది. చివరిగా లభ్యమైన డేటా ప్రకారం..29,100 అడుగులు ఎత్తు నుంచి సెకన్లలోనే 3,225 అడుగులకు పడిపోయింది.
Final seconds of #MU5735 pic.twitter.com/gCoMX1iMDL
— ChinaAviationReview (@ChinaAvReview) March 21, 2022
చైనా అధికారిక మీడియా ప్రకారం.. విమానం కూలిన వెంటనే 450 మంది ఫారెస్ట్ ఫైలర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారన్న దానిపై స్పష్టమైన సమాచారం ఏదీ ఇప్పటి వరకు తెలియరాలేదు. అలాగే, విమానం కూలిపోవడానికి గల కారణం కూడా వెల్లడికాలేదు.