China: చైనా మళ్లీ కొంప ముంచింది, వుహాన్ మార్కెట్లో 18 రకాల వైరస్‌లు, పలు రకాలైన జంతువుల్లో ఈ వైరస్‌లు కనుగొన్నట్లు తెలిపిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం
Representative Image: Coronavirus ( Photo Credits : Pixabay )

Beijing, Nov 16: కరోనావైరస్ పుట్టుకతో ప్రపంచానికి షాకిచ్చిన చైనా నుంచి మరో షాక్ న్యూస్ బయటకు వచ్చింది. కరోనావైరస్ తొలి కేసు వెలుగు చూసిన వుహాన్ మార్కెట్లో మరో 18 రకాల వైరస్ లను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. చైనా యొక్క ప్రసిద్ద మార్కెట్ లో ఈ క్షీరదాల వైరస్ (Mammalian Viruses) ని వారు కనుగొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి యొక్క మూలాలు వున్న వుహాన్ మార్కెట్లోనే ఈ వైరస్ లు వెలుగుచూడటం ఆందోళనకు గురిచేస్తోంది.

కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి (COVID-19 Pandemic) వల్ల ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 253.6 మిలియన్ల ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కాగా 5.11 మిలియన్ల మరణాలకు దారితీశాయి. ఇప్పుడు వుహాన్ మార్కెట్లో వెలుగు చూసిన వైరస్ లు ఏం కొంప ముంచుతాయోనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కనిపెట్టబడిన SARS-CoV-2 యొక్క మొదటి కేసులు వుహాన్‌లోని వెట్ మార్కెట్‌లో (Wuhan Wet Markets) జంతువుల నుండి మానవులకు వ్యాపించే అవకాశం ఉందని చైనా పేర్కొంది.

చైనాలో మళ్లీ పుంజుకున్న కరోనా, లాక్‌డౌన్ మొదలు పెట్టిన యంత్రాంగం, పలు సిటిమాల్స్ మూసివేత, కరోనా పరీక్షలను ముమ్మరం చేసిన వైద్యారోగ్యశాఖ

ఈ అధ్యయనంలో, చైనా, US, బెల్జియం, ఆస్ట్రేలియా పరిశోధకులు చైనాలో సాధారణంగా వేటాడబడే లేదా ఆహారంగా వినియోగించబడే జంతువుల్లో ఈ కొత్త వైరస్ కనుగొన్నారని, ఇది SARS-CoV, SARS-CoV-2 వైరస్ కు దగ్గరగా ఉండి వ్యాప్తి చెందేందుకు రెడీ అవుతోందని తెలిపారు. ఈ బృందం మొదటిసారిగా అనేక జంతువుల జాతులను కూడా పరిశీలించింది, వాటిలో కొన్ని కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి వాణిజ్యం లేదా కృత్రిమ పెంపకం కోసం చైనా ప్రభుత్వంచే నిషేధించబడ్డాయి.

పరిశోధకులు చైనా అంతటా 16 జాతులు, ఐదు క్షీరద ఆర్డర్‌లను సూచించే 1,725 జంతువుల మీద ఈ విశ్లేషణను నిర్వహించారు.ఈ పరిశోధనలో వారు 71 క్షీరద వైరస్‌లను గుర్తించారు. వాటిలో 45 మొదటిసారిగా వివరించబడ్డాయి. పద్దెనిమిది వైరస్‌లు మానవులకు, పెంపుడు జంతువులకు అధిక ప్రమాదంగా పరిగణించబడ్డాయని చైనాలోని నాన్జింగ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలోని వెటర్నరీ మెడిసిన్ కళాశాల నుండి సంబంధిత రచయిత షువో సు చెప్పారు.

లాక్‌డౌన్ దిశగా జర్మనీ, ఒక్కరోజే 50వేలకు పైగా కేసులు, వ్యాక్సిన్ వేసుకోని వారివల్లనే వైరస్ విజృంభణ

ముఖ్యంగా, SARS-CoV-2-వంటి వైరస్‌లను గతంలో గుర్తించిన మలయన్ పాంగోలిన్‌లతో సహా, SARS-CoV-2-వంటి లేదా SARS-CoV-వంటి సీక్వెన్స్‌లను ఈ బృందం కనుగొనలేదు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, పాంగోలిన్ SARS-వంటి వైరస్‌లు లేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, మునుపటి వైరస్-పాజిటివ్ నమూనాలన్నీ గ్వాంగ్‌డాంగ్, గ్వాంగ్జీ ప్రావిన్సులలోని కస్టమ్ అధికారులచే ఆపివేయబడ్డాయి. ఈ రెండూ జంతువుల అక్రమ రవాణాను కస్టమ్ అధికారులు సమర్థవంతంగా అడ్డుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి జరగలేదు. దీనికి విరుద్ధంగా, కొత్త వైరస్ నమూనాలను తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ లో గుర్తించారు. ఈ ప్రావిన్స్ స్మగ్లింగ్‌ను సులభతరం చేసే అంతర్జాతీయ సరిహద్దును కలిగి లేదని వారు తెలిపారు.

ఇంకా, పునుగు పిల్లి (పాగుమా లార్వాటా) అధిక ప్రమాదకర వైరస్‌లను కలిగి ఉందని బృందం కనుగొంది. పిల్లి లాంటి జీవి నుంచి కరోనావైరస్ వ్యాప్తి మరింతంగా జరిగే అవకాశం ఉందని తేల్చారు. అలాగే గబ్బిలాల నుంచి కరోనావైరస్ హెచ్‌కెయు8 పునుగు పిల్లికి కూడా వ్యాపించే అవకాశాన్ని గుర్తించారు. అలాగే గబ్బిలాల నుండి ముళ్లపందుల వరకు, పక్షుల నుండి ముళ్లపందుల వరకు కరోనావైరస్ యొక్క క్రాస్-స్పీసీ జంప్‌లను కూడా గుర్తించారు. అదేవిధంగా ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ H9N2 కూడా పునుగు పిల్లితో పాటు ఆసియన్ బ్యాడ్జర్‌లలో గుర్తించబడింది. రెండోది శ్వాసకోశ లక్షణాలను ప్రదర్శిస్తుంది, అలాగే మనుషుల నుండి వన్యప్రాణులకి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ డేటా జంతువుల్లో వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందో తెలిపే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.