Lockdown in Xi'an: చైనాలో మళ్లీ లాక్‌డౌన్, జియాన్‌లో నేటి నుంచి అమల్లోకి, అనవసరమైన ప్రయాణాలపై నిషేధం, డొమెస్టిక్‌ విమానాలు రద్దు, నిత్యావరసరాలకు ఒక్కరే బయటకు వెళ్లాలన్న నిబంధన
Representative image

Xi'an, Dec 23: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ దెబ్బకు దేశాలకు దేశాలే హడలెత్తిపోతున్నాయి. కరోనావైరస్ పుట్టినిల్లు అని చెప్పబడుతున్న చైనా ఒమిక్రాన్ ఆ దేశంలోకి రాకముందే కఠిన నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగా పశ్చిమ చైనా నగరం జియాన్‌లో గురువారం నుంచి లాక్‌డౌన్‌ (Lockdown in Xi'an) అమలు అవుతోంది.

మరికొన్ని నగరాలకు లాక్‌డౌన్‌ (China Orders Lockdown ) విధించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. కోటిన్నరకి పైగా జనాభా ఉన్న జియాన్‌లో అనవసరమైన ప్రయాణాల్ని నిషేధించారు. నిత్యావరసరాలకు ఒక్కరే బయటకు వెళ్లాలన్న నిబంధనను విధించారు. మరోవైపు డొమెస్టిక్‌ విమానాల్ని సైతం రద్దు చేసింది. కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు.

ఇక గ‌త రెండు వారాలుగా చైనాలో ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు ముందు ఒమిక్రాన్ వ్యాప్తితో ఈసారి వేడుక‌లతో పాటు కుటుంబాల‌కూ ప్ర‌జ‌లు దూరం కావాల్సిన ప‌రిస్ధితి ముంచుకొచ్చింది. డెల్టా వేరియెంట్‌ కేసుల విషయానికి వస్తే 14 జిల్లాల్లో 127 కేసులు బయటపడ్డాయి. ఇవేవీ స్థానికంగా వచ్చినవి కావని, బయటి నుంచి వచ్చినవాళ్లవేనని చైనా ప్రకటించింది. ఈ తరుణంలో వైరస్‌ విజృంభణకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు చైనా మీడియా కథనాలు వెలువరుస్తోంది.

చరిత్రలో అన్ని వైరస్‌ల కంటే వేగంగా.. ప్ర‌మాద‌క‌ర వేరియ‌ంట్‌గా ఒమిక్రాన్, తన హాలిడే ప్లాన్లను కూడా రద్దు చేసుకున్నానని తెలిపిన బిల్ గేట్స్

దీంతో పాటు సెలవుల ప్రయాణాలు, ఫిబ్రవరి నుంచి జరగబోయే వింటర్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలోనే కరోనా కేసుల్ని కట్టడి చేసే దిశగా చైనా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. 2021లో చైనాలో తొమ్మిది సార్లు కరోనావైరస్ విజృంభించింది. అయితే కరోనా మొదలైనప్పటికీ లక్షకి పైగా కేసులు, 4 వేల మరణాలు మాత్రమే ప్రకటించుకుని చైనా ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. అంతే కాకుండా జీరో కేసుల దేశంగా కూడా ప్రకటించుకుంది.

కేవ‌లం ఒక కొవిడ్‌-19 కేసు వెలుగుచూడ‌టంతో ద‌క్షిణ స‌రిహ‌ద్దులో రెండు ల‌క్ష‌ల జ‌నాభాతో కూడిన న‌గ‌రాన్ని ఈ వారం లాక్‌డౌన్ చేసిన డ్రాగ‌న్ తాజాగా వియ‌త్నాం స‌రిహ‌ద్దులో ప‌లు కేసులు బ‌య‌ట‌ప‌డిన‌ డాగ్జింగ్ న‌గ‌రాన్ని మూసివేసింది. న‌గ‌రంలోని 1.3 కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను ఇండ్ల‌లోనే ఉండాల‌ని ఆదేశించింది. న‌గ‌రంలో ప్ర‌తి ఒక్క‌రినీ టెస్ట్ చేయాల‌ని అధికారులు నిర్ణ‌యించ‌డంతో సిటీలో కార్యాల‌యాలు, వాణిజ్య సంస్ధ‌లు, విద్యాల‌యాలు, ప్ర‌జా ర‌వాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. వియ‌త్నాం నుంచి ఏటా మిలియ‌న్ ట‌న్నుల స‌రుకు ర‌వాణాకు ఎంట్రీ పాయింట్ అయిన డాగ్జింగ్‌ సిటీ వ‌ద్ద‌ కస్ట‌మ్స్ ప్ర‌క్రియ‌నూ నిలిపివేశారు. వియ‌త్నాంలో చైనా పౌరులు రోడ్డు మార్గం ద్వారా దేశంలోకి రావ‌ద్ద‌ని చైనా ఎంబ‌సీ విజ్ఞ‌ప్తి చేసింది.

డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రమాదం, ఒమిక్రాన్‌పై రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ, 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

నిత్యావ‌స‌రాల‌ను కొనుగోలు చేసేందుకు రోజు మార్చి రోజు ఇంటికి ఒక‌రిని చొప్పున అధికారులు అనుమ‌తిస్తున్నారు. ఒమిక్రాన్ భ‌యాల‌తో చైనా విధిస్తున్న నియంత్ర‌ణ‌లు 2020 ఆరంభంలో క‌రోనా కట్ట‌డికి వుహాన్ ష‌ట్‌డౌన్‌ను తలపిస్తోంది. క‌రోనావైర‌స్ కేసుల‌తో పాటు హంటా వైర‌స్ వెంటాడుతుండ‌టంతో ముప్పు రెండింత‌లైంద‌ని న‌గ‌ర‌పాల‌క సంస్ధ అధికారి జాంగ్ ఫెంఘూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇక క‌రోనా క‌ట్ట‌డికి వియ‌త్నాం స‌రిహ‌ద్దుల్లో చైనా చేప‌ట్టిన నియంత్ర‌ణ‌ల‌తో 6000కుపైగా పండ్ల ట్ర‌క్కులు స‌రిహ‌ద్దుల్లో నిలిచిపోయాయి.