Delta Covid-19 Variant Representative Image

Wuhan, August 3: చైనాలో మళ్లీ కరోనా పంజా విప్పుతోంది. వూహాన్ నగరంలో మొట్టమొదటి కరోనా (Coronavirus in China) కేసు 2019వ సంవత్సరం డిసెంబర్ నెలలో బయటపడిన తర్వాత ఆ దేశం క్రమంగా ఈ వైరస్ నుంచి కోలుకుంది. అయితే తాజాగా ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతున్న డెల్టా వేరియంట్ ( Delta outbreak spreads) ఉనికి ఆ దేశంలో బయటపడింది. సోమవారం 55 కొత్త కేసులు నమోదయ్యాయి. 20కిపైగా నగరాలు, పదికిపైగా ప్రావిన్స్‌ల్లో ఈ డెల్టా వేరియంట్‌ ఉనికి (Concerns in China grow as Delta) బయటపడింది.

దీంతో డెల్టా వేరియంట్‌న వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది. నాన్‌జింగ్‌లో రష్యా నుంచి వచ్చిన విమానాన్ని శుభ్రం చేసిన 9 మంది ఎయిర్‌పోర్టు కార్మికులకు డెల్టా వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో బీజింగ్‌ సహా పెద్ద నగరాల్లో కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు. డెల్టా ప్రమాకరంగా మారిన నేపథ్యంలో హునాన్‌ ప్రావిన్స్‌లోని జుజౌ సిటీలో సోమవారం లాక్‌డౌన్‌ విధించారు. దీంతో 10.2 లక్షల మంది ఇళ్లకే పరిమితమయ్యారు.

ఇక రాజధాని బీజింగ్‌లో డెల్టా వేరియంట్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి బీజింగ్‌లోకి పర్యాటకులు రాకుండా ఆంక్షలు విధించారు. ఇక పర్యాటక ప్రాంతమైన జాంగ్‌జీజియాజీలో శుక్రవారం లాక్‌డౌన్‌ అమలు చేశారు. చాంగ్‌పింగ్‌లోనూ గత వారం లాక్‌డౌన్‌ విధించారు.తాజాగా హెనాన్‌ ప్రావిన్స్‌ల్లో కొత్త కేసులు అధికంగా బయటపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

దేశంలో తగ్గుతున్న కేసులు, అయినా భయపెడుతున్న థర్డ్ వేవ్, తాజాగా 30,549 మందికి కరోనా, కేరళలో కేసుల పెరుగుదలకు కారణాలను కనుగొన్న వైద్య బృందం, ఉత్తరాఖండ్‌లో ఈ నెల 10వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఇక వుహాన్ ( Wuhan ) న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌నున్నారు. వుహాన్ న‌గ‌రంలో సుమారు కోటిన్న‌ర మంది నివాసితులు ఉన్నారు. అయితే వారంద‌రికీ స‌మ‌గ్ర న్యూక్లిక్ యాసిడ్ ప‌రీక్ష‌లు చేయ‌నున్న‌ట్లు ఆ న‌గ‌ర అధికారి లీ టావో తెలిపారు. న‌గ‌రంలో ఉన్న ఏడు మంది వ‌ల‌స కార్మికుల‌కు మ‌ళ్లీ వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు గుర్తించారు. ఇటీవ‌ల మ‌ళ్లీ వైర‌స్ కేసులు ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో చైనాలోని అన్ని న‌గ‌రాల్లోనూ ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేశారు.

వేగంగా విస్త‌రిస్తున్న డెల్టా వేరియంట్‌ను అడ్డుకునేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. మంగ‌ళ‌వారం కొత్త‌గా 61 కేసులు న‌మోదు అయ్యాయి. బీజింగ్‌తో పాటు అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వైర‌స్ ప‌రీక్ష‌ల జోరును పెంచారు. యాంగ్‌జూ న‌గ‌రంలో ఉన్న 13 ల‌క్ష‌ల మంది పౌరుల‌ను ఇండ్ల‌కే ప‌రిమితం చేశారు. ప్ర‌తి ఇంటి నుంచి ఒక్క‌రికి మాత్ర‌మే బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశం క‌ల్పించారు.పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించడాన్ని సాధ్యమయినంత మేరకు తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు.

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వస్తుందా, నోటుపై వైరస్ ఎంతకాలం అంటుకుని ఉంటుంది, కరెన్సీ ద్వారా Sars-Cov-2 వైరస్ వ్యాప్తిపై నిపుణుల పరిశోధనలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దామా..

కోవిడ్‌–19 ఒరిజినల్‌ వెర్షన్‌ కంటే డెల్టా వేరియంట్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు ఇప్పటికే గుర్తించారు. కరోనా వ్యాక్సినేషన్‌ నెమ్మదిగా సాగుతున్న వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ఈ వేరియంట్‌ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. జపాన్, దక్షిణ కొరియాలోనూ డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా నియంత్రణకు ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోంది. పెద్ద నగరమైన సిడ్నీలో చాలారోజులుగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.