Yoshihide Suga (Photo Credits: Twitter)

Tokyo, July 31: ఒలింపిక్స్‌ పోటీలు జరుగుతున్న జపాన్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌ జరుగుతున్న టోక్యో రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి (Japan imposes state of emergency in Tokyo) విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పటిష్ట చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశ రాజధాని టోక్యోతో పాటు సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి సుగ (Prime Minister Yoshihide Suga) ప్రకటించారు. ఆగస్ట్‌ 31వ తేదీ వరకు ఎమర్జెన్సీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. హొక్కయిడో, ఇషికవ, క్యోటో, హ్యోగో, ఫకుఒక, ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.

కరోనా థర్డ్ వేవ్..ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టా వేరియంట్, 132 దేశాలకు పాకిన ప్రమాదకర వైరస్, ఇప్పటి వరకు నాలుగు ఆందోళనకర వేరియంట్లు వెలుగులోకి, దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలకు పలు సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. ప్రయాణాలు విరమించుకోవాలని తెలిపింది. కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలని హెచ్చరించింది. ఆగస్ట్‌ నెలాఖరు వరకు 40 శాతం ప్రజలకు రెండు డోసులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.

Here's PM's Office of Japan Tweet

ఆ దేశంలో గతవారంతో పోలిస్తే పది శాతం మేర కేసులు పెరిగాయి. ఏప్రిల్‌, జూన్‌ నెల మధ్యలో నెమ్మదించిన కరోనా జూలై తీవ్రమైంది. ముఖ్యంగా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం​ దేశ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు జరుగుతున్నాయి. దీంతో జపాన్‌లో పెరుగుతున్న కరోనాతో ఇతర దేశాలు కూడా భయాందోళన చెందుతున్నాయి. తమ క్రీడాకారుల ఆరోగ్యంపై దృష్టి సారించాయి.