J&J (photo credits: File Image)

Washington, October 13: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి నిరోధానికి పలు ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు చివరి దశకు చేరాయి. ఈ వ్యాక్సిన్‌ పరీక్షలు (COVID-19 Vaccine Update) ఆశాజనకంగా సాగుతున్న క్రమంలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే) (Johnson & Johnson) కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. మూడో దశ(ఫేజ్-3) ట్రయల్స్‌లో పాలు పంచుకుంటున్న వలంటీర్లలో ఒకరు అనారోగ్యం బారిన పడటంతో ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సంస్థ (J&J) సోమవారం నాడు ప్రకటించింది.

తాము నిర్వహించిన అధ్యయన పరీక్షలో పాల్గొన్న ఓ వ్యక్తి వివరించలేని అస్వస్థతకు లోనవడంతో తమ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై (COVID-19 Vaccine) మూడవ దశ పరీక్షలు సహా అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ మూడో దశ ట్రయల్స్‌ను ప్రారంభించింది. దీంతో 60,000 మందిని క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ వ్యవస్థను మూసివేశారు. మరోవైపు రోగుల భద్రతా కమిటి భేటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఈ ఘటనపై లోతైన అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది.

కరోనాపై మళ్లీ షాకింగ్ నిజాలు, మనుషుల చర్మంపై 9 గంటల దాకా బ్రతికే ఉంటుంది, శీతాకాలంలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదం

ఏ క్లినికల్‌ ట్రయల్స్‌లో అయినా ముఖ్యంగా భారీ అధ్యయనాల్లో తీవ్ర ప్రతికూల ఘటన(ఎస్‌ఏఈ)లు ఊహించదగినవేనని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పేర్కొంది. అధ్యయనాన్ని నిలిపివేసి ఎస్‌ఏఈకి కారణం ఏమిటనేది పరిశీలించి వ్యాక్సిన్‌ మానవ పరీక్షలను పునరుద్ధరిస్తామని తెలిపింది.

కరోనా పేషెంట్లకు మరో ముప్పు, వారి బాడీలోకి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వైరస్, ఆశ్చర్యపోతున్న వైద్యులు

అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా 200 కేంద్రాల్లో 60,000 మంది వాలంటీర్లపై భారీగా మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు సెప్టెంబర్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. అమెరికాతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూ, దక్షిణాఫ్రికాలో క్లినకల్‌ ట్రయల్స్‌ను కంపెనీ నిర్వహిస్తోంది.

బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం

వాలంటీర్ అనారోగ్యానికి కారణం ఔషధమా లేదా మరేదైనానా..తెలుసుకునేందుకు అధ్యయానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తాం’ అని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. క్లీనికల్ ట్రయల్స్‌లో ఇటువంటి పరిణామాలు సహజమే. భారీ స్థాయిలో అధ్యయానాలు చేపట్టినప్పుడు ఇటువంటి ఘటన జరుగుతాయి. అయితే..కంపెనీ మార్గదర్శకాల ప్రకారం ఇందుకు గల కారణాలు తెలుసుకునేందుకు ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తామని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.