Coronavirus in India (Photo Credits: PTI)

చైనాలో కరోనా కన్నా.. దాని వల్ల పెట్టిన లాక్ డౌన్ తోనే జనాలకు పిచ్చి ఎక్కిపోతోంది. జీరో కొవిడ్’ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుండడంతో చైనా వాసులు విలవిలలాడిపోతున్నారు.ఏప్రిల్ 5 నుంచి దేశంలోని ఆర్థిక రాజధాని షాంఘై సహా 23 సిటీల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఇంట్లోనే ఉంటుడడం, ఆహారం ఇతర అవసరాలకు కొరత ఏర్పడడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సిటీలోని ప్రజలు తమ అపార్ట్ మెంట్ల నుంచే అరుపులు, కేకల ద్వారా అధికారుల తీరును ఎండగడుతున్నారు.

ఇంతటి లాక్ డౌన్ ను అమలు చేసే బదులు తమను చంపేయాలంటూ వేడుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆ వీడియోలను అమెరికాకు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఎరిక్ ఫీల్డింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అపార్ట్ మెంట్లలోని ప్రజలు ‘యావో మింగ్ లే’, ‘యావో షీ’ అంటూ స్థానిక షాంఘైనీస్ భాషలో మాట్లాడారని, వాటి అర్థాలు బతుకు, చావు అని చెప్పారు. అయితే, ప్రజలు మాత్రం బతుకు కన్నా చావు కోసమే ఎక్కువ అరుపులు వినిపించాయని, అంత దీనంగా అక్కడ పరిస్థితులున్నాయని తెలిపారు. చైనాలో ఆగని కరోనా కల్లోలం, షాంఘైలో రికార్డు స్థాయిలో కేసులు, మిలిటరీని, వేలాది మంది డాక్టర్లను రంగంలోకి జిన్ పింగ్ ప్రభుత్వం

Here's China Videos

షాంఘైలో ఓ డాక్టర్ విశ్రాంతి లేక కుప్పకూలిపోవడంతో ఐసోలేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న రోగులే ఆ డాక్టర్ ను మోసుకెళ్లారు. దానికి సంబంధించిన వీడియోనూ ఎరిక్ ఫీల్డింగ్ ట్వీట్ చేశారు. కాగా, ఒక్క ఆదివారమే 25 వేల మందికిపైగా చైనాలో కరోనా బారిన పడ్డారు. లాక్ డౌన్ కారణంగా ఆహారం, ఇతర అవసరాలకు కొరత ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.