Uk, Feb 18: ఒమిక్రాన్ రూపంలో వచ్చిన కొవిడ్-19 ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది.ఈ నేపథ్యంలో కరోనావైరస్ మామూలు పరిస్థితులు వస్తాయని అనుకుంటున్న తరుణంలో మరో షాకింగ్ వార్త ఆందోళన రేపుతోంది. యూకేలో మరో హైబ్రిడ్ స్ట్రెయిన్ (Hybrid Omicron and Delta Covid variant) వెలుగులోకి వచ్చింది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కలయికతో వచ్చిన ఈ కొత్త వేరియంట్ (New Covid variant found in UK ) డెల్టాక్రాన్ ఇప్పుడు కలవరపెడుతున్నది. యూరప్ దేశమైన సైప్రస్‌లో ఈ కొత్త స్ట్రెయిన్‌ను (Deltacron Covid 'hybrid variant) గుర్తించినట్లు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది.
వాస్తవానికి డెల్టాక్రాన్ వేరియంట్‌ను డిసెంబర్ చివరి వారంలోనే సైపస్ దేశానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. యూనివర్శిటీ ఆఫ్ సైప్రస్‌లో పనిచేస్తున్న లియోనిడోస్ కోస్ట్రికిస్ తన బృందం ఈ డెల్టాక్రాన్‌కి సంబంధించి సుమారు 25 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు 25 డెల్టాక్రాన్ కేసుల సీక్వెన్సులు జనవరి 7, 2022న వైరస్‌లో మార్పులను ట్రాక్ చేసే అంతర్జాతీయ డేటాబేస్ అయిన GISAIDకి పంపించారు కూడా. అప్పుడు అందులో డెల్టా జన్యువులతో పాటు ఒమిక్రాన్ జన్యువులు కూడా కనిపించాయి. అయితే తొలుత దీన్ని ల్యాబ్ ఎర్రర్‌గా తోసిపుచ్చారు. కానీ ఆ తర్వాత పరీక్షల్లో హైబ్రిడ్ స్ట్రెయిన్‌గా నిర్ధారించారు.
డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల (Omicron and Delta variants) రీకాంబినేషన్‌తో ఈ కొత్త వేరియంట్ డెల్టాక్రాన్ ఏర్పడినట్లు స్పష్టమవుతోందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల జెనెటిక్ మెటీరియల్‌ను పరస్పర బదిలీ చేసుకోవడం ద్వారా ఈ వేరియంట్ ఏర్పడినట్లు తెలిపింది.
గత వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ను అడ్డుకోగలదని యూకేకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ వేరియంట్ ఎంతగా వ్యాప్తి చెందుతుంది, ఎంతవరకు ప్రమాదకరమైనది అనే విషయాలను అధికారికంగా ఇప్పటివరకు యూకే నిపుణులు వెల్లడించలేదు. సెకండ్‌వేవ్‌లో డెల్టా వేగంగా వ్యాపించి ఎంతలా ప్రాణాంతకంగా మారిందో తెలిసిందే. మూడోవేవ్‌లో ఒమిక్రాన్ అంత ప్రభావంతంగా వ్యాప్తి చెందకపోయినప్పటికి మరింత ప్రమాదకారి మాత్రం కాలేదు.
ఈ క్రమంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్ బార్‌క్లే లాబొరేటరీలో పరిశోధనా సహచరుడు థామస్ పీకాక్ కూడా డెల్టాక్రాన్ అంత ప్రభావవంతమైనది కాదని స్పష్టంగా తెలుస్తుందని అన్నాడు. కానీ కోస్ట్రికిస్ తన వాదనను సమర్థించటమే కాక కరోనా వైరస్ కొత్త రూపాంతరం అయిన ఈ హైబ్రిడ్ వేరియంట్ డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌ల కంటే వేగంగా వ్యాపిస్తుందంటూ హెచ్చరిస్తున్నాడు. మరోవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో వేగంగా సంక్రమించే అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా ఉందని పేర్కొనడం గమనార్హం.