Credits: Google

French Man Drugged Wife Every Night: ఫ్రాన్స్ దేశంలోని మజాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను నమ్మి వచ్చిన భార్య పట్ల ఓ భర్త అత్యంత హేయంగా ప్రవర్తించాడు.రాత్రిపూట ఆమె తినే ఆహారంలో డ్రగ్స్ కలిపి (French Man Drugged Wife Every Night) పరాయి వ్యక్తులతో అత్యాచారం చేయించాడు. పదేళ్లు పాటు సాగిన ఈ దారుణంలో ఆమెపై 51 మంది అత్యాచారం చేశారు.

టెలీగ్రాఫ్ కథనం మేరకు.. డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు ప్రతి రోజూ రాత్రి లోరజపామ్ అనే సెడేటివ్ మందును అన్నంలో కలిపి తినిపించే వాడు. దాంతో ఆమె స్పృహ తెలియకుండా నిద్రపోయేది. ఇక ఆ సమయంలో పరాయి పురుషులను తన ఇంటికి ఆహ్వానించి భార్యను అప్పగించే వాడు. 26 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయసు వారు (Then Recorded 51 Men Raping Her) ఇందులో పాల్గొన్నారు.

కదులుతున్న రైలులో అత్యాచారానికి ఒప్పుకోలేదని దారుణం, మహిళను రైలు నుంచి తోసేసిన కామాంధులు, అడ్డు వచ్చిన బంధువుపై దాడి

ఇలా భార్యపై పరాయి పురుషులు అత్యాచారం చేస్తున్న తతంగాన్ని డొమినిక్ వీడియో తీసి యూఎస్ బీ డ్రైవ్ లో స్టోర్ చేసే వాడు. అదిప్పుడు పోలీసుల స్వాధీనంలో ఉంది. 2011 నుంచి 2020 మధ్య మొత్తం 92 సార్లు అత్యాచారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. 51 మందిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. డొమినిక్, సదరు మహిళకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

పెళ్లాం వేధింపులు తట్టుకోలేక డాక్టర్ దారుణం, భార్యను ఉరితీసి, పిల్లల్ని బావిలో పడేసి, తాను కూడా ఆత్మహత్య, వైద్యుడి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

అయితే పొగతాగే, పెర్ ఫ్యూమ్ కొట్టుకొని వచ్చే వారిని డొమినిక్ ఆహ్వానించే వాడు కాదు. ఆ వాసనకు తన భార్య స్పృహలోకి వస్తుందని జాగ్రత్తలు తీసుకునే వాడు. తన నివాసానికి దూరంగా వాహనాలను పార్క్ చేసి రావాలని కోరేవాడు. తన భార్య వంటిపై చేతులు వేస్తే స్పర్శ తెలియకుండా వేడి నీళ్లతో చేతులు కడుక్కుని వెళ్లాలని అతిథులను కోరేవాడు. నిందితుల్లో ఫైర్‌మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, బ్యాంకు ఉద్యోగి, జైలు గార్డు, నర్స్, ఓ జర్నలిస్ట్ సహా పలు రంగాలకు చెందినవారు ఉన్నారు.

మూడేళ్ల కిందట దుస్తులు మార్చుకునే గదుల్లో మహిళలను రహస్యంగా కెమెరాలతో వీడియోలు తీసున్నట్టు అనుమానం రావడంతో డొమినిక్ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో అత్యాచార వీడియోల గురించి పోలీసులు తెలుసుకున్నారు. తనకు తెలియకుండా పదేళ్ల నుంచి భర్త చేసి దారుణం తెలిసి బాధితురాలు షాక్‌లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ మహిళ విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.