కెన్యా రాజధాని నైరోబీలో గురువారం భారీ గ్యాస్ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 167 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పేలుడు ధాటికి కంపెనీలో ఉన్న భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
Here's Videos
WATCH: Massive gas explosion in Nairobi, Kenya. At least 2 dead, 167 injured. Death toll expected to rise pic.twitter.com/cfle9onXYT
— BNO News (@BNONews) February 2, 2024
BREAKING: Gas station explodes in Nairobi, Kenya. At least 165 injured, rescue work ongoing pic.twitter.com/M9SktooFdF
— BNO News (@BNONews) February 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)