Tel Aviv, October 18: హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించారు. ఆయన ఎయిర్‌ఫోర్స్ వన్‌లో టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో దిగారు. అక్కడ బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) స్వాగతం పలికారు.హమాస్ తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తన బలమైన మద్దతును ప్రదర్శించడమే ఆ దేశంలో బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని వైట్‌హౌస్ ప్రకటించింది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్‌తో చర్చించనున్నట్లు వెల్లడించింది.
గాజా స్ట్రిప్ ఆసుపత్రిలో జరిగిన పేలుడు ఇజ్రాయెల్ వల్ల సంభవించలేదని తెలుస్తోందని అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం అన్నారు.నేను చూసిన దాని ఆధారంగా, ఇది ఇతర బృందం చేసినట్లుగా కనిపిస్తుంది, మీరు కాదు" అని బిడెన్ ఒక సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో అన్నారు. కానీ పేలుడుకు కారణమేమిటో ఖచ్చితంగా తెలియదని "అక్కడ చాలా మంది వ్యక్తులు" ఉన్నారని బిడెన్ చెప్పారు.
గాజా ఆసుపత్రిపై దాడి ఇజ్రాయెల్ చేసిందే, IDF ఆరోపణలను తిప్పి కొట్టిన Islamic Jihad
ఇజ్రాయెల్ వైమానిక దాడి విధ్వంసానికి కారణమైందని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం తమ ప్రమేయాన్ని ఖండించింది. మరొక మిలిటెంట్ గ్రూప్ అయిన పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నుండి మిస్ ఫైర్డ్ రాకెట్‌ను ప్రయోగించిందని తెలిపింది.అయితే, ఆ సంస్థ కూడా మేము ప్రయోగించలేదంటూ ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించింది. బిడెన్ ఇజ్రాయెల్‌లో ఆగిన తర్వాత జోర్డాన్‌ను కూడా సందర్శించాల్సి ఉంది, అయితే ఆసుపత్రి పేలుడు తర్వాత సమావేశాలు రద్దు చేయబడ్డాయి. బైడెన్ జోర్డాన్ పర్యటన రద్దైనట్లు జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది తెలిపారు. అయితే ఇందుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
Here's Video
"It appears the hospital explosion was done by the other team, not you (Israel), we have to overcome those don't see it," says U.S. President Joe Biden pic.twitter.com/xf71bss5IJ
— i24NEWS English (@i24NEWS_EN) October 18, 2023
హమాస్ మిలిటెంట్లు దుర్మార్గాలకు పాల్పడ్డారని బిడెన్ అన్నారు. ఇటువంటి సమయంలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తోన్న పోరుకు అమెరికా మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని చెప్పడానికి ఇక్కడ అడుగుపెట్టినట్లు స్పష్టం చేశారు.నేను ఇక్కడకు రావడానికి ఒకేఒక చిన్న కారణం. అమెరికా ఎవరివైపు ఉంటుందనే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజలతో పాటు యావత్ ప్రపంచానికి చెప్పడానికే ఇక్కడకు వచ్చా. హమాస్ మిలిటెంట్లు దుశ్చర్యలకు పాల్పడ్డారు. అవి ఐఎస్‌ఐఎస్ మాదిరిగానే ఉన్నాయి.
పాలస్తీనియన్లందరికీ హమాస్ ప్రాతినిధ్యం వహించడం లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది వారికి బాధలనే మిగిల్చింది’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. హమాస్ మిలిటెంట్ల దాడిలో 1400లకు పైగా ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సంఘీభావంగా జో బైడెన్ అక్కడ పర్యటిస్తున్నారు. ఓవైపు హమాస్ దాడులు, మరోవైపు గాజాపై ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అగ్రరాజ్య అధ్యక్షుడు ఈ అరుదైన పర్యటన చేయడం గమనార్హం.
సెంట్రల్ గాజాలోని అహ్లీ అరబ్ ఆసుపత్రిపై జరిగిన భారీ దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంలో జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఈ దాడులపై ఇజ్రాయెల్-గాజా అధికారుల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. అది ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడి అని గాజా పేర్కొనగా.. ఇజ్రాయెల్ మాత్రం ఆ దాడులు హమాస్‌లు ప్రయోగించిన రాకెట్లు మిస్‌ఫైర్ అయినట్లు చెబుతోంది. మరోవైపు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఈ వారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు సమాచారం.
10 రోజులుకు పైగా జరుపుతున్న ఉగ్రవాద సంస్థ హమాస్ దాడుల్లో 1300 మంది ఇజ్రాయిల్స్‌తోపాటు 31 మంది అమెరికన్లు మరణించినట్లు బిడెన్ పేర్కొన్నారు. చిన్నారులు, మహిళలతో సహా అనేకమందిని బందీలుగా ఉంచారని విమర్శించారు. ఐసిస్ ఉగ్రవాదులకు మించి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పాలస్తీనా ప్రజల గౌరవం, స్వీయనిర్ణయాధికారాన్ని హమాస్ ప్రతిబింబించదని పునరుద్ఘాటించారు.
విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నందుకు బైడెన్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధ సమయంలో తమ దేశంలో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ నిలిచారని అంటూ పేర్కొన్నారు. ఇది ఇజ్రాయెల్, యూదుల భవిష్యత్తు పట్ల తనకున్న వ్యక్తిగత నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా అందిస్తున్న సాయాన్ని మరవలేమని పేర్కొన్నారు.
తమ ఓపికను పరీక్షించవద్దనే స్పష్టమైన సందేహాన్ని హమాస్‌కు తెలియజేసినందకు ధన్యవాదాలు తెలిపారు. ఐఎస్‌ఐఎస్‌ను. నాజీలను ఓడించడానికి ప్రపంచం ఏకం అయినట్లే.., హమాస్‌ను ఓడించడానికి కూడా విశ్వమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌తోపాటు ప్రపంచంలో శాంతి, భద్రత కోసం ఇది జరగాల్సిన అవసరం ఉందన్నారు.