New Delhi, NOV 14: నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (KTF) అధిపతిగా భావిస్తున్న ఉగ్రవాది అర్షదీప్ గిల్ అలియాస్ అర్ష్ దల్లాను (Arsh Dalla) అప్పగించాలని కెనడా ప్రభుత్వాన్ని (Canada Govt) భారత్ కోరింది. ఇంతకు ముందు ఈ నెల 10న కెనడా ప్రభుత్వాన్ని కోరింది. దాని కొనసాగింపుగా కెనడాలోని ఒంటారియో కోర్టులో అర్ష్ దల్లా అప్పగింత పిటిషన్ లిస్టయిందని విదేశాంగశాఖ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.
India Seeks Extradition of KTF Chief Arshdeep
Our response to media queries regarding the arrest of a designated terrorist in Canada:https://t.co/c6CasRuteb pic.twitter.com/XfH4S5UzUr
— Randhir Jaiswal (@MEAIndia) November 14, 2024
ఆయన ఆర్థిక లావాదేవీలను ధృవీకరించాలని, ఆయన్ను అప్పగించాలని గతేడాది విడిగా కెనడా ప్రభుత్వాన్ని విదేశాంగ శాఖ కోరింది. హత్యలు, హత్యాయత్నం, దోపిడీలు, ఉగ్రవాద దాడులు, ఉగ్రవాదులకు ఆర్థికసాయం తదితర 50కి పైగా కేసుల్లో అర్ష్ దల్లా ‘నేరస్తుడి’గా విదేశాంగ శాఖ తెలిపింది.
గతేడాది జనవరిలో ఆయన్ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోరింది. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ కు చెందిన హర్దీప్ నిజ్జర్ హత్య తర్వాత ఆ సంస్థ బాధ్యతలను అర్ష్ దల్లా చేపట్టాడని కేంద్రం భావిస్తున్నది. 2023 జూన్ లో జరిగిన నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా మధ్య దౌత్య యుద్ధానికి దారి తీసింది. ఈ కేసులో అర్ష్ దల్లాను కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది.