Ajay Banga (Photo Credits: Twitter@raghav_chadha)

వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భార‌త సంత‌తికి చెందిన‌ అజ‌య్ బంగా నియామ‌కం కానున్నారు. ఈ మేర‌కు వ‌ర‌ల్డ్ బ్యాంక్ ధృవీక‌రించింది. మాస్ట‌ర్ కార్డ్ మాజీ సీఈవో అయిన అజ‌య్ బంగా వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

ఈ ప‌ద‌విలో ఆయ‌న ఐదేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పోస్టుకు అజ‌య్ బంగా నామినేట్ అయ్యారు. అధ్యక్షుడు జో బిడెన్ ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించడానికి 63 ఏళ్ల బంగాను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు, ఎందుకంటే అతను "చరిత్రలో ఈ క్లిష్ట సమయంలో" ప్రపంచ సంస్థను నడిపించడానికి "బాగా సన్నద్ధమయ్యాడని తెలిపారు.

జీతం ఇవ్వలేదని దేశ మంత్రిని కాల్చి చంపిన బాడీగార్డు, కాల్పుల్లో అక్కడికక్కడే మరణించిన ఉగాండా దేశ కార్మిక శాఖ సహాయమంత్రి చార్లెస్‌ ఎంగోలా

ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని బోర్డు స‌భ్యులంద‌రూ ఆమోదించిన అనంత‌రం వ‌రల్డ్ బ్యాంక్ ఒక ప్ర‌క‌ట‌న చేసింది. అజ‌య్ బంగా వ‌రల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఐదేండ్ల పాటు కొన‌సాగుతార‌ని వెల్ల‌డించింది. కాగా 189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. ఈ వ‌ర‌ల్డ్‌ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో ఉన్న ఇండియన్స్ సేవ‌లందిస్తున్నారు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా అన్షులా కాంత్‌, చీఫ్‌ ఎకానమిస్ట్‌గా ఇందర్‌మిత్‌ గిల్‌, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌గా లక్ష్మీ శ్యామ్‌ సుందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పరమేశ్వరన్‌ అయ్యర్ కొన‌సాగుతున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం, డ్రోన్లతో దాడి , ఉక్రెయిన్ పనే అంటున్న మాస్కో వర్గాలు..

మాజీ మాస్టర్ కార్డ్ ఇంక్. చీఫ్, బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు ప్రపంచ బ్యాంకు అనే రెండు అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు అధిపతి అయిన మొట్టమొదటి భారతీయ-అమెరికన్,  సిక్కు-అమెరికన్ బంగా.