Coronavirus in India: ఇండియాలో రెండవ ధపా కరోనా వేవ్, వ్యాక్సిన్‌పై ఇంకా క్లారిటీ లేదు, దేశంలో తాజాగా 86,432 మందికి కరోనా, 40 లక్షలు దాటిన కోవిడ్ కేసులు
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, September 5: దేశవ్యాప్తంగా కొత్తగా 86,432 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179 కు (coronavirus in India) చేరింది. గత 24 గంటల్లో 1,089 కరోనా బాధితులు ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 69,561 కు (coronavirus Deaths in India) చేరింది. కరోనా బారినపడ్డవారిలో ఇప్పటివరకు 31,07,223 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 8,46,395 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

పాజిటివ్ కేసుల్లో బ్రెజిల్‌ను భార‌త్ (Coronavirus in India and Brazil) స‌మీపిస్తున్న‌ట్లు రికార్డులు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఐసీఎంఆర్ (ICMR) కూడా త‌న ప‌రీక్ష‌ల నివేదిక‌ల‌ను రిలీజ్ చేసింది. సెప్టెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు 4,77,38,491 మంది క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఐసీఎంఆర్ చెప్పింది. నిన్న ఒక్క రోజే 10,59,346 మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీస‌ర్చ్ త‌న బులిటెన్‌లో పేర్కొన్న‌ది. మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, ఏపీల్లోనే 70 శాతం కోవిడ్‌19 మ‌ర‌ణాలు చోటుచేసుకున్న‌ట్లు ఆరోగ్య‌శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో కరోనావైరస్ 

మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 19 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 378 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,63,062కు చేరుకుంది. అలాగే మొత్తం కరోనా మృతుల సంఖ్య 25,964గా నమోదయ్యింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజులో ఏకంగా 19,298 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా పూణెలో 4,744 కేసులు నమోదయ్యాయి. 119 మంది మృతి చెందారు. నాసిక్‌లో కొత్తగా 2,912 కేసులు నమోదుకాగా 49 మంది మృతి చెందారు. నాగపూర్‌లో 2,448 కేసులు నమోదు కాగా 26 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో కొత్తగా 1,929 కరోనా కేసులు నమోదు కాగా 35 మంది మృతి చెందారు.

దేశ వ్యాప్తంగా మొదలైన సెకండ్‌ వేవ్

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ పెరిగిందని, కొన్నిచోట్ల సెకండ్‌ వేవ్‌ కూడా మొదలై పోయిందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో తీసుకున్నంతగా ప్రజలు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం లేదని, ఢిల్లీలో కొంతమంది మాస్కులు లేకుండానే బయట సంచరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, బిట్ కాయిన్ విరాళాలుగా ఇవ్వాలని మెసేజ్ చేసిన హ్యాకర్లు

గుంపులుగా ఒక్కచోట చేరుతున్నారని, కరోనా వ్యాప్తికి ముందున్న విధంగానే భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందని.. ఇవన్నీ సెకండ్‌ వేవ్‌కు దారితీసే విధంగా ఉన్నాయన్నారు. చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడప్పుడే వైరస్‌ కనుమరుగయ్యే అవకాశం కనిపించడం లేదని, భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు 

ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో పాటు భారీగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,73,552కి చేరింది. అలాగే ఇప్పటి వరకు కరోనా బారిన పడి 8,78,083 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకుని 1,88,83,183 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70,12,286 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కోవిడ్-19 వ్యాక్సిన్ ఇప్పట్లో కష్టమే 

కరోనా వైరస్ మహమ్మారితో తల్లడిల్లిపోతూ ప్రపంచమంతా కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ రాబోయే 2021 మధ్యభాగంలో వ్యాక్సిన్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌లన్నీ ప్రయోగదశలో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ ఈ విషయమై మాట్లాడుతూ ‘వ్యాక్సిన్ తయారుచేస్తున్న ఏ దేశం కూడా ఇప్పటివరకూ అడ్వాన్స్ ట్రయల్ వరకూ చేరుకోలేదని, అందుకే వచ్చే ఏడాది మధ్యస్థానికి ముందుగానే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావం కలగడం లేదన్నారు. బ్యాన్ అయిన చైనా యాప్స్ లిస్టు ఇదే..పబ్జీ గేమ్‌తో సహా 118 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం

మూడవ దశ సుదీర్ఘంగా ఉంటుంది

వ్యాక్సిన్ ట్రయల్స్‌లో మూడవ దశ సుదీర్ఘంగా ఉంటుందని, ఈ సమయంలో ఆ వ్యాక్సిన్ ఎంతవరకూ రక్షణ ఇస్తున్నదనే విషయం పరిశీలించాల్సివున్నదన్నారు. అలాగే కరోనా నుంచి ఎంతవరకూ కాపాడగలదనే అంశాన్ని కూడా పరిశీలించాలన్నారు. ఇప్పటి వరకూ ఏ వ్యాక్సిన్ కూడా కనీసం 50 శాతం వరకైనా ప్రభావవంతంగా ఉన్నాయన్న స్పష్టమైన సంకేతాలు అందలేదన్నారు. ఇదిలావుండగా రష్యాలో హ్యూమన్ ట్రయల్స్ పూర్తిచేసుకుని, ఆగస్టులోనే వ్యాక్సిన్ బయటకు వచ్చింది.అయితే ఈ వ్యాక్సిన్ అందించే రక్షణపై పలువురు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో అక్టోబర్ చివరి నాటికి టీకా

ఇక అమెరికాకు చెందిన వైద్యవిభాగపు అధికారులు అక్టోబర్ చివరి నాటికి టీకా సిద్ధమవుతుందని తెలిపారు. నవంబరు 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందుగా ఈ టీకా అందరికీ అందుబాటులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్‌ నుంచే 3 వ్యాక్సిన్లు రాబోతున్నాయి. అయితే ఏ వ్యాక్సిన్‌ అయినా ఎంత వరకు సురక్షితం, సమర్థవంతమైనది అన్న దానిపైనే కరోనా కట్టడి ఆధారపడి ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు.