ఇండోనేషియాలో (Indonesia ) అర్ధరాత్రి సమయంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సులవేసి ద్వీపం (Sulawesi island)లోని సముద్రంలో పడవ మునిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గల్లంతయ్యారు. ఆగ్నేయ సువలేసి ప్రావిన్స్ రాజధాని కేందారీ(Kendari)కి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునా ద్వీపం (Sulawesi island)లోని ఒక బే గుండా ఈ నౌక ప్రయాణికుల్ని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
చెరువులో పడిన బస్సు.. 17 మంది జల సమాధి.. మరో 35 మందికి తీవ్ర గాయాలు.. బంగ్లాదేశ్‌లో ఘటన
ప్రమాద సమయంలో పడవలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఆరుగురు ప్రాణాలతో బటయడినట్లు ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.