ఇరాన్ బాంబుల మోతతో దద్దరిలింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ సైనికాధికారి జనరల్ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం బుధవారం జరుగుతున్న వేళ నిమిషాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 103 మంది మరణించగా, 188 మందికి గాయాలయ్యాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. సులేమాని నాలుగో వర్ధంతి సందర్భంగా కెర్మాన్ పట్టణంలోని ఓ శ్మశానంలో ఉన్న ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకొన్నారు.
ఈ సమయంలో దాదాపు 20 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగాయని అధికారులు తెలిపారు.మొదట బాంబు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేలిందని, 20 నిమిషాల తర్వాత మరో బాంబును ఆపరేట్ చేశారని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహ్మద్ వాహిది వెల్లడించారు. రెండో పేలుడు ఘటనలోనే ఎక్కువ మంది మరణించారని, గాయపడ్డారని తెలిపారు.
Here's News
BREAKING: 103 killed in Iran blasts near grave of general Soleimani: state media https://t.co/SlnPm3MzMw
— Insider Paper (@TheInsiderPaper) January 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)