Iranian Supreme Leader Ali Khamenei (Photo Credits: X/@Khamenei_fa)

Iran, OCT 02: మిడిల్‌ ఈస్ట్‌ రీజియన్‌లో యుద్ధ వాతావరణం (Middle East War) కొనసాగుతున్న వేళ.. ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) సంచలన ఆరోపణలకు దిగారు. ప్రస్తుత సంక్షోభానికి కారణం ఎవరో చెబుతూ.. వరుస ట్వీట్లు (Khamenei Tweets) చేశారాయన. మిడిల్‌ ఈస్ట్‌లో అంతర్యుద్ధాలకు, యుద్ధాలకు.. అమెరికా, యూరోపియన్‌ దేశాలే కారణం. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన పేరిట వస్తున్నవాళ్ల సమక్షంలోనే ఇదంతా జరుగుతోంది. ఈ ప్రాంతం నుంచి ఆ శత్రుమూకలు గనుక వైదొలిగితే.. కచ్చితంగా ఈ అంతర్యుద్ధాలు, యుద్ధాలు ఆగిపోతాయి అని అన్నారాయన. అంతేకాదు.. ఇస్లామిక్‌ రెవల్యూషన్‌ స్ఫూర్తి.. ఇరాన్‌ ప్రజలు, మిత్రదేశాల సహకారంతో శత్రు సంహారం చేపడతామని ప్రతిజ్ఞ చేశారాయన.

Ali Khameni Tweet

 

ఇదిలా ఉంటే.. లెబనాన్‌లో హెజ్‌బొల్లాను (Hezbollah) లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. దీనికి ప్రతిగా ఇరాన్‌ 180 మిస్సైల్స్‌ను ఇజ్రాయెల్‌ మీదకు ప్రయోగించింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వైరంలో ఇదే అతిపెద్ద దాడి కావడం గమనార్హం. తమపై దాడులకు దిగితే గనుక టెహ్రాన్‌ వర్గాల నుంచి మరింత ధీటైన బదులు వస్తుందని ఇరాన్‌ రెవల్యూషన్‌ గార్డులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

Ali Khameni Tweet

 

అయితే ఇరాన్‌ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ హెచ్చరించగా.. దాడులకు మిత్రపక్షం అమెరికా కూడా మద్దతు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.