Dead Body. (Photo Credits: Pixabay)

Melbourne, July 6:  ఆస్ట్రేలియాలోని 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని భారత్‌కు చెందిన మాజీ ప్రియుడు కిడ్నాప్ చేసి దాదాపు 650 కి.మీ దూరం కారులో తీసుకువెళ్లి దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని రిమోట్ ఫ్లిండర్స్ రేంజ్‌లో సజీవంగా పాతిపెట్టాడు.ప్రేమించిన వ్యక్తే అతికిరాతకంగా హత్య చేశాడు.బతికుండగానే కళ్లు, కాళ్లు చేతులు కట్టేసి మరీ పూడ్చిపెట్టి సజీవ సమాధి చేశాడు. తనను దూరం పెట్టిందనే కోపంతోనే ఆ ప్రేమోన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆస్ట్రేలియా ఈ ఘోరం రెండేళ్ల కిందట చోటు చేసుకుంది.

భారత్‌కు చెందిన జాస్మిన్‌ కౌర్‌(21) ఆస్ట్రేలియాలో నర్సింగ్‌ చదువుకునేందుకు వెళ్లింది. అక్కడే తారిక్‌జోత్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే.. తారిక్‌ ప్రవర్తనలో మార్పు గమనించిన కౌర్ అతన్ని దూరం పెడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్నాడు. అడిలైడ్‌లో ఆమె పని చేసే చోట నుంచే కిడ్నాప్‌ చేశాడు తారిక్‌. కారులో ఆమెను బంధించి.. నాలుగు గంటలపాటు ప్రయాణించి ఫ్లిండర్స్‌ రేంజ్స్‌ చేరుకున్నాడు. అక్కడే ఘోరానికి పాల్పడ్డాడు.

వీడియో ఇదిగో, మహిళ ముందే ఫ్యాంట్ విప్పి అది చూపిస్తూ అత్యాచారయత్నం, పాకిస్తాన్‌లో దారుణ ఘటన

మార్చి 2021లో ఆమె కళ్లకు గంతలు కట్టి.. కాళ్లు చేతుల్ని కేబుల్స్‌తో కట్టేసి.. సమాధి చేశాడు. ఆ తర్వాత ఆమె మిస్సింగ్‌ కేసు నమోదుకాగా.. కొన్ని నెలలకు ఆమె హత్యకు గురైందన్న విషయం బయటపడింది. మైల్ ఎండ్‌లోని బనింగ్స్‌లో హత్యకు కొన్ని గంటల ముందు అతను చేతి తొడుగులు, కేబుల్ టైలు మరియు పార కొనుగోలు చేస్తూ సిసిటివిలో పట్టుబడ్డాడు.ఈ ఏడాది ఫిబ్రవరిలో అతనే దోషిగా తేలింది.

ఈ మేరకు బుధవారం వాదనలు విన్న స్థానిక కోర్టు.. అతనిది ప్రతీకారచర్యగా తేల్చడంతో పాటు జీవిత ఖైదు శిక్ష పడొచ్చని తేల్చి చెప్పింది. జాస్మిన్‌ను ఎక్కడైతే ఆ ప్రేమోన్మాది పూడ్చిపెట్టి హత్య చేశాడో.. అక్కడే ఆమెకు సమాధి కట్టి ప్రార్థనల ద్వారా నివాళులర్పిస్తూ వస్తోంది ఆ కుటుంబం. అతని నేరానికి క్షమాపణే ఉండకూదని కోరుకుంటోంది. వచ్చే నెలలో తీర్పును వెలువరించనుంది