Ottawa, December 5: ఢిల్లీలో రైతుల ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శాంతియుత నిరసన హక్కులకు కెనడా ఎల్లప్పుడూ మద్దతునిస్తుంది’’ అంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) భారత రైతులకు సంఘీభావం తెలుపుతూ వీడియో విడుదల చేసిన సంగతి విదితమే. అయితే దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. రైతుల ఆందోళనపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, పార్లమెంట్ సభ్యులు చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది.
భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా తలదూర్చడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి చర్యలు ఇకపై కొనసాగితే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో కెనడా హైకమిషనర్‌కు ఆ దేశ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యల తీవ్రతను తెలియజేసింది.
అయినప్పటికీ రైతుల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్టు మరోసారి కెనడా అధ్యక్షుడు (Justin Trudeau Ignores Modi Govt's Warning) స్పష్టం చేశారు. ఇండియా హెచ్చరికలను బేకాతరు చేస్తూ రైతు నిరసనకు ట్రూడో మద్దతు ఇవ్వడం పట్ల ఇండియా ఏ రీతిలో స్పందించనుందో ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. గత సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కెనడా ప్రధాని ట్రూడో ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై మాట్లాడారు.
రైతులకు మద్దతుపై ఇండియాలో ఆయనపై వస్తున్న వ్యతిరేకతను ఓ జర్నలిస్టు ప్రస్తావించగా.. శాంతియుతంగా నిరసన ప్రపంచంలో ఎక్కడ జరిగినా కెనడా మద్దతు ఇస్తుందంటూ సమాధానం ఇచ్చారు. ఏ సమస్యనైనా చర్చలతో పరిష్కరించుకోవాలని మేము కోరుకుంటున్నాము’’ అని ట్రూడో సమాధానం ఇచ్చారు. దీనికి కొద్ది రోజుల ముందు ఇండియాలో జరుగుతున్న నిరసనకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
‘‘ఇండియాలో రైతులు నిరసన చేస్తున్నారన్న వార్త తెలిసింది. పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. మా ఆలోచనంతా వారి కుటుంబ సభ్యుల గురించే శాంతియుతంగా నిరసన తెలియజేసే వారి హక్కుల పరిరక్షణకు కెనడా మద్దతు ఇస్తుందని మీకు గుర్తుచేయాలనుకుంటున్నాను. మేము చర్చల ప్రముఖ్యతను విశ్వసిస్తాం. మా ఆందోళనను ఇండియన్ అధికారుల ముందు వ్యక్తం చేశాం. మనందరిని ఒక దగ్గర కలిపి ఉంచే క్షణం ఇది’’ అని ట్రూడో అన్నారు.
ఈ మేరకు.. ‘‘ఒక సమస్య గురించి చర్చించడం అన్నింటి కంటే ముఖ్యమైనది. ఈ విషయం గురించి భారత అధికారులతో మాట్లాడి మన ఆందోళనను తెలియజేద్దాం. మనమంతా కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఇది’’ అని ట్రూడో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీనిపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ఇండియాలోని కెనడా అంబాసిడర్‌కు సమన్లు జారీ చేసింది.