Justin Trudeau, Erin O'Toole. (Photo Credits: Facebook

Ottawa, Sep 21: కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని చేపట్టబోతున్నారు. సెప్టెంబర్‌ 20న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో (Canada Election Result 2021) ఆయన పార్టీ విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, సొంతంగా పూర్తి మెజారిటీ సాధించడంలో మాత్రం అధికార పార్టీ వెనుకబడింది. అధికార లిబరల్‌ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటీవ్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది,. అయినా జస్టిన్‌ ట్రూడోనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ప్రతిపక్ష నాయకుడు ఎరిన్‌ ఒ టూలే తమ ఓటమిని అంగీకరించడంతో ప్రధాని జస్టిన్‌ ట్రూడో విజయం ఖాయమైంది.

కెనడా పార్లమెంటు (House of Commons)లో మొత్తం 338 సీట్లు ఉండగా.. విజయం సాధించాలంటే 170 సీట్లు పొందాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో అధికార పార్టీ 155 స్థానాలకే పరిమితమైంది. పూర్తి మెజారిటీ సాధించనప్పటికీ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీ సాధించడంలో విఫలమైంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం 156 స్థానాలు మాత్రమే పొందగలిగింది. ఇక ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ మాత్రం 121 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ఓటమిని ఒప్పుకోవడంతో జస్టిన్‌ ట్రూడో మూడోసారి విజయానికి మార్గం సుగమమైంది.

కాల్పులతో దద్దరిల్లిన యూనివర్సిటీ, 8 మంది మృతి, మరింత మందికి గాయాలు, నిందితుడిని పట్టుకున్న పోలీసులు, రష్యా పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో ఘటన

ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో పాపినియో స్థానం నుంచి పోటీ చేసి పార్ల‌మెంట‌రీ సీటును గెలుచుకున్నారు. స్వంత జిల్లాకు వెళ్లి ట్రూడో ఓటేశారు. పోల్ వ‌ర్క‌ర్ల‌ను మెచ్చుకుంటూ ప్ర‌ధాని త‌న ట్విట్ట‌ర్‌లో కొన్ని ఫోటోలు పోస్టు చేశారు. ఇక ప్ర‌త్య‌ర్థి క‌న్జ‌ర్వేటివ్ నేత ఎరిన్ కూడా త‌న పార్ల‌మెంట్ స్థానంలో విజ‌యం సాధించారు. ఓంటారియోలోని దుర్హ‌మ్ నుంచి ఆయ‌న పోటీ చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు ట్రూడో త‌న ట్విట్ట‌ర్‌లో ఓ ట్వీట్ చేశారు. ప‌ది డాల‌ర్ల‌కే చైల్డ్ కేర్, చౌకైన ఇళ్లు, ఆయుధాల‌పై నిషేధం, గ్రీన్ జాబ్స్‌, న‌ర్సులు, డాక్ట‌ర్లు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ కావాలంటే లిబ‌ర‌ల్ పార్టీకి ఓటు వేయాల‌ని ట్రూడో ఆ ట్వీట్‌లో కోరారు.

ఈసారి కెన‌డా పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో 17 మంది భార‌తీయ సంత‌తి వ్య‌క్తులు ఎంపీలుగా ఎన్నిక‌య్యారు. జ‌గ్‌మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్ర‌టిక్ పార్టీ 27 సీట్లు గెలిచి కీల‌కంగా మారింది. జ‌గ్‌మీత్ మ‌ద్ద‌తులోనే ట్రూడో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. మాజీ మంత్రులు టిమ్ ఉప్ప‌ల్‌, హ‌ర్జిత్ సింగ్ స‌జ్జ‌న్‌, బర్దిశ్ చాగ‌ర్‌, అనితా ఆనంద్‌లు కూడా మ‌ళ్లీ ఎన్నిక‌య్యారు. వాంకోవ‌ర్ నుంచి ర‌క్ష‌ణ మంత్రి హ‌ర్జిత్ సింగ్ స‌జ్జ‌న్ రెండోసారి గెలిచారు. వాట‌ర్‌లూ సీటు నుంచి ఛాగ‌ర్ విజ‌యం సాధించారు.

పళ్ల‌తో కొరికి రిబ్బన్ కట్ చేసిన పాకిస్తాన్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్, క‌త్తెర‌ పదునుగా లేకపోవడంతో ఘటన, వైరల్ అవుతున్న క్లిప్

బ్రిటీష్ కొలంబియా నుంచి సుఖ్ ద‌లివాల్‌, స‌ర్రీ సెంట‌ర్ నుంచి ర‌ణ్‌దీప్ సింగ్ సారాయి గెలిచారు. క్యుబెక్ నుంచి ఇండో కెన‌డియ‌న్ అంజూ ధిల్లాన్ మ‌రోసారి ఎంపీ అయ్యారు. కాల్గ‌రి ఫారెస్ట్ లాన్ స్థానం నుంచి జ‌స్‌రాజ్ సింగ్ హ‌ల్ల‌న్ విక్ట‌రీ కొట్టారు. ఎడ్మంట‌న్ మిల్ వుడ్స్ నుంచి ఉప్ప‌ల్ మ‌రోసారి గెలుపొందారు. ఒంటారియాలో న‌లుగురు సిట్టింగ్ ఇండో కెన‌డియ‌న్లు విజ‌యం సాధించారు. ఎంపీలు మ‌ణింద‌ర్ సిద్దూ, రూబీ స‌హోటా, సోనియా సిద్దు, క‌మ‌ల్ ఖేరాలు గెలిచారు. నేపియ‌న్ సీటు నుంచి చంద్ర ఆర్యా విజ‌యం సాధించారు.