లండన్‌లోని లూటన్ విమానాశ్రయంలో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో మంటలు పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తించాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలో రాకపోకలను నిలివేశారు. ఈ మేరకు ప్రయాణికులకు సమాచారం అందించినట్టు అధికారులు తెలిపారు.లండన్‌లోని లూటన్ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులోని కారు పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి వేళ మంటల కారణంగా విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది.
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, దట్టమైన పొగను పీల్చుకున్న కొందరు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పార్కింగ్ ఏరియాలో దాదాపు 1200 వాహనాలు నిలిచి ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఈవీ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది.
Here's Video
BREAKING: All flights suspended at London Luton International Airport due to large fire burning nearby carpark pic.twitter.com/7AofLxII0V
— Insider Paper (@TheInsiderPaper) October 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)