OVID-19 vaccine | Representational Image (Photo Credits: IANS)

New Zealand December 12: దొంగ సాక్ష్యం చెప్పే వాళ్ల ను చూసి ఉంటాం...ఒకరి బదులు ఒకరు ఎగ్జామ్ రాసిన వాళ్లను చూసి ఉంటాం....అంతెందుకు ఒకరికి బదులు ఒకరు జైలుకు వెళ్లిన వాళ్లను కూడా చూసి ఉంటాం...కానీ న్యూజిల్యాండ్(New Zealand) కు చెందిన ఓ వ్యక్తి మాత్రం మరొకరికి బదులు తాను వ్యాక్సిన్(vaccine) వేసుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక్కటే రోజు ఏకంగా పది(10 COVID -19 vaccine doses in 24 hours) కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నాడు.

శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం కరోనా నుంచి రక్షణ పొందేందుకు కేవలం రెండు డోసులు చాలు(Two doses), మరికొన్ని దేశాల్లో బూస్టర్ డోసు(Booster Dose) కూడా సిఫారసు చేస్తున్నారు. అది కూడా కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే న్యూజిలాండ్ కు చెందిన ఒక వ్యక్తి ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పది డోసుల వ్యాక్సిన్(10 COVID -19 vaccine doses in 24 hours) తీసుకున్నాడు. ఆ వ్యక్తికి కొంతమంది డబ్బులు ఇచ్చి, తమ తరఫున వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఆ వ్యక్తి ఒక దాని తర్వాత ఒకటిగా వివిధ వ్యాక్సినేషన్ సెంటర్ల(Immunization Program in New Zealand)కు వెళ్లి.. తనకు డబ్బులు ఇచ్చిన వాళ్ల పేరున తను వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇలా చేయడం చాలా పెద్ద తప్పని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Covid Nasal Vaccine: మరో కీలక అడుగు..ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్, రెండు, మూడో ద‌శ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్, యూఎస్‌లోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న భార‌త్ బ‌యోటెక్

ఒకేరోజ పది వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తి గురించి రికార్డులను పరిశీలిస్తుండగా తేలింది. అయితే అతని వివరాలు పూర్తిగా తెలియరాలేదు. దీంతో అతని కోసం ట్రేసింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ సీరియస్‌ గా తీసుకుంది. ఓవర్ డోసింగ్(overdosing) వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందని, అతని ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశముందంటున్నారు. అతను ఎక్కడున్నా ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకోవాలని ప్రకటించారు. వీలైతే శాస్త్రవేత్తలను కలిసి సలహాలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.