Naypyitaw (Myanmar), July 2: మయాన్మార్ దేశంలోని పచ్చ రత్నాల గనిలో ఘోరం ప్రమాదం (Myanmar Jade Mine Tragedy) జరిగింది. మయన్మార్‌లో మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో గనిలోకి ఒక్కసారిగా భారీగా బురద, రాళ్లు వచ్చి చేరడంతో కార్మికులు అక్కడే 50 మందికి పైగా సజీవ సమాధి(Myanmar Jade Mine Landslide) అయిపోయారు. కచీన్ రాష్ట్రంలోని పకాంత్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై గ్రేనేడ్ దాడి, ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు, నలుగురు ఉగ్రవాదులు హతం
ప్రమాద సమయంలో వారందరూ పచ్చ రత్నాలను ఏరే పనిలో నిమగ్నమై ఉన్నారని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు..ఈ ప్రాంతంలో చట్టవ్యతిరేకంగా రత్నాల సేకరణ జరుగుతూ ఉంటుందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.
కొండచరియలు విరిగిపడటం, ఇతర ప్రమాదాల కారణంగా నిత్యం అనేక మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతుంటారని కూడా తెలిసింది. నార్తర్న్ మయన్మార్‌లో ఉన్న జేడ్ గనిలో ఈ ప్రమాదం జరిగింది. కాగా మట్టిచరియల కింద కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అగ్నిమాపక శాఖ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. 2015లో ఇక్కడే జరిగిన ఘటనలో 116 మంది మరణించారు.