Pakistan Stock Exchange (Photo Credits: Facebook)

Islamabad, June 29: పాకిస్తాన్‌లో ఉగ్రమూకలు (Terror attack) మరోసారి రెచ్చిపోయాయి. దాయాది దేశంలోని క‌రాచీలో ఉన్న స్టాక్ మార్కెట్ బిల్డింగ్ వ‌ద్ద ఈ రోజు గ్రేనేడ్ దాడి (Pakistan Stock Exchange Attack) జరిగింది. ఇవాళ ఉదయం నలుగురు ఉగ్రవాదులు కరాచీలోని స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు (Terror attack in Karachi) జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతిచెంద‌గా మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. కాల్పులకు తెగబడిన అనంతరం ఉగ్రవాదులు పాకిస్తాన్ స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలోనే నక్కారు. అమెరికా కీలక నిర్ణయం, విదేశీ వ‌ర్క‌ర్ల‌కు ఇచ్చే వీసాల‌ు రద్దు, అమెరికా ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్

పోలీసులు, రేంజ‌ర్లు.. ఘ‌ట‌నా స్థ‌లి వ‌ద్ద ఎదురుకాల్పులు జ‌రిపారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భద్రతా బలగాలు అందర్నీ భవనం నుంచి ఖాళీ చేయించి ఉగ్రవాదులను ఏరివేశాయి. మొత్తం నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, తొలుత ఎంట్రీ గేటు వద్ద గ్రనేడ్ పేల్చిన ఉగ్రవాదులు.. అనంతరం లోపలికి చొరబడి బీభత్సం సృష్టించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు సింధ్ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ ముస్తాక్ మ‌హ‌ర్ తెలిపారు. సింధ్ గ‌వ‌ర్న‌ర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ ఈ దాడిని ఖండించారు.

బిల్డింగ్ ప్ర‌ధాన గేటు వ‌ద్ద మిలిటెంట్లు గ్రేనేడ్ దాడికి పాల్ప‌డ్డారు. ఆ త‌ర్వాత విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌కు తెగించారు. గేటు వ‌ద్ద ఉన్న పోలీసుల ఆఫీస‌ర్ , సెక్యూర్టీ గార్డు ఈ కాల్పుల్లో గాయ‌ప‌డ్డారు. స్టాక్ మార్కెట్ బిల్డింగ్‌లో ఉన్న వారిని సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. పార్కింగ్ ఏరియా నుంచి భ‌వ‌నంలోకి ఉగ్ర‌వాదులు ఎంట‌ర్ అయ్యార‌ని, ఆ త‌ర్వాత వాళ్లు ఫైరింగ్‌కు దిగిన‌ట్లు పాకిస్థాన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ డైర‌క్ట‌ర్ అబిద్ అలీ హ‌బీబ్ తెలిపారు.

Pakistan Stock Exchange (Photo Credits: Facebook)