Airstrike by Myanmar's military junta. (Photo Credit: Twitter

Bangkok, April 12: మయన్మార్‌లో పాలక సైన్యం సొంత పౌరులపై వైమానిక దాడి జరిపింది. సైనిక పాలనను వ్యతిరేకించే ఓ వర్గంపై ఆర్మీ ఎయిర్‌ స్ట్రైక్‌ (Myanmar Military Airstrike) చేసింది. ఈ భీకర దాడిలో 100 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. సగయింగ్‌ ప్రాంతంలోని (Sagaing Region) పాజిగై గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటలకు సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యారు.

సరిగ్గా అదే సమయంలో మయన్మార్ సైన్యం ఆ గ్రామంపై ఫైటర్ జెట్‌తో బాంబుల వర్షం కురిపించింది.దాడి తామే చేసినట్లు (Myanmar’s Military Junta Confirms Deadly Air Strike) అక్కడి సైనిక ప్రభుత్వం జుంటా ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నందుకు పాజిగై గ్రామంపై అటాక్‌ చేశామని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.

పక్కింటివానిపై పగతో పాడు పని, రాత్రిపూట 1100 కోళ్లను దారుణంగా ఫ్లాష్ లైట్ వేసి చంపేసిన చైనీయుడు, నిందితుడుకి జైలు శిక్ష విధించిన చైనా కోర్టు

ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. సైన్యం ఫిబ్రవరి 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి దేశ అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు విపరీతంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భద్రతా బలగాలు దాదాపు 3,000 మంది పౌరులను పొట్టనపెట్టుకున్నట్లు సమాచారం.

తమదే అసలైన ప్రభుత్వమని (National Unity Government) ఎన్‌యూజీ చెప్పుకుంటున్నదని, అది సైన్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదని తెలిపారు. మృతుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఫైటర్లు కూడా ఉన్నారని, వారిలో కొందరు సాధారణ పౌరుల్లా దుస్తులు ధరించాలని చెప్పారు.

మద్యానికి అలవాటుపడిన కుక్క, యజమాని మరణించాక తీవ్ర అనారోగ్యం, చికిత్సతో కోలుకున్న కుక్క, యూకేలో తొలికేసు

పీపుల్స్‌ డిఫెన్స్ ఫోర్స్‌ ఆ ప్రాంతంలో మందుపాత్రలు పాతిపెట్టడంతోనే చాలా మంది మరణించారని ఆరోపించారు. స్థానిక ప్రజలను భయపెట్టి తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. బౌద్ధ గురువులతోపాటు టీచర్లు, సాధారణ పౌరులను చంపేస్తున్నారని తెలిపారు. ఈ దాడిని ఎన్‌యూజీ తీవ్రంగా ఖండించింది. అమాయక ప్రజలకు వ్యతిరేకంగా తీవ్రవాద మిలిటరీ చేసిన దాడి అని అభివర్ణించింది.