New COVID Variant B.1.X: మళ్లీ కొత్త వేరియంట్ల షాక్, ఫ్రాన్స్‌లో కలకలం రేపుతున్న B.1.X లేదా B.1.640 వేరియంట్,నార్వేలో క‌రోనావైర‌స్‌లో కొత్త ర‌కం డెల్టా స్ట్రెయిన్, చైనాను వణికిస్తున్న డెల్టా వేరియంట్‌
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Paris, November 15: కొత్త కోవిడ్-19 వేరియంట్‌కు సంబంధించిన అనేక కేసులను ఫ్రాన్స్ గుర్తించింది, ఐరోపాలో వైరస్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ అక్కడ కలకలం రేపుతోంది. B.1.X లేదా B.1.640 అని పిలవబడే వేరియంట్ (New COVID Variant B.1.X) అక్టోబర్‌లో బన్నాలెక్,  ఫినిస్టేర్‌లలో కనుగొనబడిందని ఫ్రెంచ్ దినపత్రిక Le Telegramme నివేదించింది. అక్కడ పాఠశాలలో 18 మంది విద్యార్థులతో సహా 24 మందికి వ్యాధి సోకిన తర్వాత ఇది (New COVID-19 Variant B.1.X Found in France) కనుగొనబడింది. ఈ వైరస్ కనిపించిన వెంటనే ఆ పాఠశాలలో 50 శాతం తరగతులను మూసివేయవలసి వచ్చింది.

అక్టోబర్ 26 నుండి ఫ్రాన్స్‌లో కొత్త ఇన్ఫెక్షన్లు ఏవీ కనుగొనబడకపోవడంతో వ్యాప్తి ఇప్పుడు నియంత్రణలో ఉందని ఫ్రెంచ్ ప్రాంతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, ఈ వేరియంట్ (New COVID-19 Variant B.1.X) నిఘాలో ఉందని జెరూసలేం పోస్ట్ నివేదించింది. UK, స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, ఇటలీలలో కూడా ఈ కొత్త వేరియంట్ (B.1.x or B.1.640 ) యొక్క కొన్ని కేసులు కనుగొనబడ్డాయి, అయినప్పటికీ డెల్టా వేరియంట్ ఈ ప్రాంతాలలో అత్యధికంగా నమోదు అవుతోంది. దీంతో ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి రావడం లేదు.

యూరప్ దేశాల్లో మళ్లీ కరోనా కల్లోలం, ఒక్కసారిగా పెరిగిన కేసులు, మరణాలు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

UK యొక్క ఆరోగ్య భద్రతా ఏజెన్సీ B.1.640ని పర్యవేక్షణలో ఉన్న ఒక వేరియంట్‌గా వర్గీకరించింది. అయితే US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఇంకా B.1.640ని ఇంకా కొత్త వేరియంట్ జాబితాలోకి చేర్చలేదు. అయినప్పటికీ, యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ECDC) B.1.x లేదా B.1.640ని మానిటరింగ్ (VUM) లేదా ఉత్పరివర్తన వైరస్ కింద వేరియంట్‌గా గుర్తించింది

ఫ్రాన్స్‌కు చెందిన బార్-ఇలాన్ విశ్వవిద్యాలయానికి చెందిన సిరిల్ కోహెన్ ప్రకారం, వేరియంట్ B.1.640లో కొన్ని అపూర్వమైన ఉత్పరివర్తనలు ఉన్నాయి. ఈ వైరస్ మానవ కణానికి అతుక్కొని ఇన్‌ఫెక్షన్ ప్రక్రియను ప్రారంభించేలా చేసే స్పైక్ ప్రోటీన్, కొన్ని తొలగింపులను కలిగి ఉందని తెలిపింది. అయితే ఇది వైరస్‌ను మరింతగా వ్యాప్తి చెందుతుందా లేదా తక్కువ ప్రభావం చూపిస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ వేరియంట్ ఆఫ్రికా నుండి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

చైనాలో మళ్లీ పుంజుకున్న కరోనా, లాక్‌డౌన్ మొదలు పెట్టిన యంత్రాంగం, పలు సిటిమాల్స్ మూసివేత, కరోనా పరీక్షలను ముమ్మరం చేసిన వైద్యారోగ్యశాఖ

ఇక నార్వేలో క‌రోనా వైర‌స్‌లో కొత్త ర‌కం డెల్టా స్ట్రెయిన్ బ‌య‌ట‌ప‌డింది.నార్వేజియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ (NIPH) ఈ మేరకు ఒక ప్ర‌క‌ట‌న చేసింది. అయితే ఈ కొత్త వేరియంట్ ఇప్ప‌టికే ఉన్న డెల్టా వేరియంట్‌ల కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన‌దేమీ కాద‌ని NIPH శాస్త్ర‌వేత్త తెలిపారు. నార్వేలో గ‌త జూన్ చివ‌రిద‌శ‌లో తొలి డెల్టా వేరియంట్ బ‌య‌ట‌ప‌డింద‌ని ఆ త‌ర్వాత అది దేశ‌మంతా వ్యాపించింద‌ని నార్వే ఆరోగ్య నిపుణులు చెప్పారు.

ఇప్పుడు తాజాగా గుర్తించిన వేరియంట్ దానికంటే ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది కాద‌ని అన్నారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న క‌రోనా వ్యాక్సిన్‌లు ఈ కొత్త వేరియంట్‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్‌పై ప‌నిచేయ‌వు అని చెప్ప‌డానికి త‌గిన ఆధారాలు ఏవీ లేవ‌ని చెప్పారు. అంత‌ర్జాతీయంగా ఈ కొత్త డెల్టా వేరియంట్‌ను AY.63గా గుర్తించారు. మొట్ట‌మొద‌ట నార్వేలో గుర్తించిన‌ట్లు లేబుల్ చేశారు.

కరోనావైరస్ పిఫ్త్ వేవ్ ముంచుకొస్తోంది, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఫ్రెంచ్‌ ఆరోగ్యమంత్రి ఆలివర్‌ వెరాన్‌

చైనాలో డెల్టా ర‌కం క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం రేపుతున్న‌ది. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న‌ది. చైనాలోని మిగ‌తా ప్రాంతాల‌తో పోల్చుకుంటే బీజింగ్‌లో కేసులు ఎక్కువ‌గా ఉండ‌టంతో.. కొన్ని ఏరియాల్లో బీజింగ్ నుంచి వ‌చ్చేవారిపై ఆంక్ష‌లు విధించారు. క‌రోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే బీజింగ్ నుంచి వ‌చ్చేవారిని త‌మ ప్రాంతంలోకి అనుమ‌తిస్తున్నారు. చైనా మెయిన్ లాండ్‌లో అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కు మొత్తం 1,308 మందిలో క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

ఇదిలావుంటే గ‌త వేస‌విలో డెల్టా వేరియంట్ విజృంభ‌ణ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,280 డెల్టా ర‌కం క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. చైనాలోని 21 ప్రావిన్స్‌లు, రీజియ‌న్‌లు, మున్సిపాలిటీల్లో డెల్టా వేరియంట్ ప్ర‌భావం ఉన్న‌ది. ఇత‌ర దేశాల్లో కంటే చైనాలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డి ప్ర‌భుత్వ జీరో టోలరెన్స్ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు వైర‌స్ సంక్ర‌మ‌ణను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా నిలిపివేసే చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ది.