Coronavirus in India (Photo-PTI)

Colombo, April 25: ప్రపంచాన్ని కొత్త స్ట్రెయిన్లు కలవరపెడుతున్నాయి. వివిధ దేశాల్లో కొత్త స్ట్రెయిన్లు (New Covid Strain) ఇప్పటికే ప్రజలను భయాందోళనకు గురి చేస్తుండగా.. శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్తరకం కరోనాను (New and more potent strain of coronavirus) (కొత్త స్ట్రెయిన్‌ను) గుర్తించారు. ఇది శ్రీలంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నదని నిపుణులు చెబుతున్నారు.

ఈ కొత్త వైరస్ గంట వరకు గాలిలో ఉంటున్నది. శ్రీలంలో గత వారం జరిగిన కొత్త సంవత్సరం వేడుకల తర్వాత నుంచి కొత్త స్ట్రెయిన్‌ (New Covid strain found in Sri Lanka) వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఎక్కువగా యువత ఈ కొత్త స్ట్రెయిన్ బారిన పడుతున్నారు. ఇది రానున్న 2 వారాల్లో కరోనా మూడో దశ ఉద్ధృతికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంపర్లలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ గంట వరకు గాలిలో ఉంటున్నదని గుర్తించామని శ్రీలంక ఇమ్యునాలజీ, మాలిక్యులర్‌ సైన్సెస్‌ విభాగం చీఫ్‌ నీలికా మలవిగే తెలిపారు. ఇది ఇప్పటివరకు గుర్తించిన అన్ని వైర‌స్‌ల‌లో కెల్లా ప్రాణాంతకమైనదని శాస్త్ర‌వేత్త‌లు చెప్తున్నారు. ఈ జాతి వైర‌స్‌ గాలి ద్వారా సోకుతుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

జూన్‌ నాటికి కరోనా కేసులు తగ్గుముఖం, వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్లే కేసుల పెరుగుదల అంటున్న నిపుణులు, దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు నమోదు, పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమల్లోకి..

శ్రీలంకలోని జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలోని ఇమ్యునాలజీ, మాలిక్యులర్ సైన్సెస్ విభాగాధిపతి నీలిక మాలావిగే ఈ కొత్త జాతికి సంబంధించిన విశేషాల‌ను మీడియాకు వివ‌రించారు. ఈ ర‌కం వైర‌స్‌ చాలా తేలికగా, చాలా త్వరగా వ్యాపిస్తుందని చెప్పారు. శ్రీలంకలో కనిపిస్తున్న‌ అన్ని వేరియంట్లలో ఈ జాతి అత్యంత ప్రాణాంతకమైనది, వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు.

కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై కస్టమ్స్ సుంకం రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం, మూడు నెలలపాటు అమల్లో.., ప్రయోజనం పొందే వాటి వివరాలు ఓ సారి తెలుసుకోండి

గత వారం నూతన సంవత్సర వేడుకల నుంచి కొత్త జాతి వ్యాప్తి చెందడం శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ది. యువతలో ఎక్కువగా ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుండ‌టంతో మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. రాబోయే రెండు, మూడు వారాల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎంతగా వ్యాపిస్తుందో, మూడవ వేవ్ వ్యాప్తి చెందుతుందని పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఉపల్ రోహనా చెప్పారు. మొదటి ఇన్‌ఫెక్ష‌న్‌ లక్షణాలు అంత స్పష్టంగా లేవని ఆయన అన్నారు. కొవిడ్ నుంచి రక్షణ కోసం మే 31 నాటికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. మరోవైపు కరోనా కట్టడికి శ్రీలంక ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.