New York, September 19: అగ్రరాజ్యం అమెరికా మరోసారి రక్తమోడింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో పెద్ద ఎత్తున కాల్పులు (New York Mass Shooting) చోటుచేసుకున్నాయి. గుర్తు తెలియని దుండుగులు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి రోచెస్టర్‌లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు (US mass shooting) జరిగినట్టు గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30కు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
అయితే దేశంలో నల్లజాతీయులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా రోచెస్టర్‌లో అర్థరాత్రి వరకుఆందోళన కొనసాగాయి. ఈ ఆందోళన కొనసాగుతుండగానే కాల్పులు చెలరేగాయి. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పౌరులు తీవ్ర గాయలపాలైయ్యారు. పౌరుల మృతిపై యావత్ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సమాచారం అందిన వెంటనే కాప్స్ ఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన పారిపోయిన దుండగుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
అమెరికాలో కాల్పుల సంస్కృతి సాధారణమైపోయింది. నిత్యం ఎక్కడో ఒక చోట కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అమెరికాలో పౌరులపై కాల్పులు జరిగిన ప్రతిసారీ తుపాకుల వినియోగానికి కళ్లెం వేయాలనే డిమాండ్ వినిపిస్తుంటుంది. అమెరికాలో జరిగే హత్యలు, ఆత్మహత్యల్లో అత్యధికంగా తుపాకీనే వాడుతున్నారు. కాగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఆయుధాలు కలిగి ఉన్న దేశం అమెరికానే.
ఆయుధాల నియంత్రణకు పట్టుబట్టే వారి సంఖ్య పెరుగుతున్నా ఈ దిశగా నిర్దిష్ట చర్యలు కనిపించడం లేదు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు అధికంగా ఆయుధాలు కలిగి ఉన్నారు. గ్రామీణులు ఎక్కువగా ఉండే న్యూయార్క్, కాలిఫోర్నియాతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ తుపాకులకు మద్దతుగా నిలిచే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నారు.