Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

London, Dec 9: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. అతి తక్కువ కాలంలోనే ఈ వేరియంట్ (Omicron Spread) చాలా దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు 57 దేశాల్లో కొత్త వైరస్‌ కేసులు నమోదయ్యాయి. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కేసులు, ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య పెరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. మరో వైపు యూరప్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్థానిక ఆరోగ్య సంస్థ పేర్కొంది.

అయితే గ‌త కోవిడ్ వేరియంట్లతో వ‌చ్చిన వ్యాధుల క‌న్నా.. ఒమిక్రాన్‌తో (Omicron variant of Covid-19 spreads) వ‌చ్చే వ్యాధులు మ‌రీ ప్ర‌మాద‌క‌రంగా ఏమీలేవ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. టీకా ర‌క్ష‌ణ‌ను పూర్తిగా దాటివేసే శ‌క్తి ఒమ్రికాన్‌కు లేద‌న్న అభిప్రాయాన్ని డ‌బ్ల్యూహెచ్‌వో వినిపించింది. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో అధికారి తెలిపారు. దీనిపై మ‌రింత అధ్య‌య‌నం జ‌ర‌గాల్సి ఉంద‌ని మైఖేల్ ర్యాన్ చెప్పారు. ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్ గురించి తెలుస్తోంద‌ని, పూర్తి స‌మాచారం అందే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న అన్నారు.

కొవిడ్ -19 కారణంగా ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య ముందు రోజుతో పోలిస్తే రెండింతలు పెరిగింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) ప్రకారం.. గత 24 గంటల్లో 383 మంది ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు రోజు 175 ఆసుపత్రుల్లో చేరారు. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. కొత్తగా నమోదైన 13,147 కొత్త కేసుల్లో 64 శాతం గౌటెంగ్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఈ ప్రావిన్స్‌లో జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా ఉన్నాయి.

యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆందోళన

కరోనా కారణంగా మరణాలు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య నిరంతరం పెరుగుతున్నదంటూ యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) ఆందోళన వ్యక్తం చేసింది. ఐరోపాలో కొత్త వేరియంట్‌ వ్యాప్తిగా వేగంగా సాగుతున్నది. ఈ క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మళ్లీ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. రెస్టారెంట్లు, బార్లలో టీకాలు తీసుకోని వ్యక్తులను నిషేధించడంతో పనిచేసే చోట్ల పని గంటలు తగ్గింపు తదితర చర్యలు తీసుకుంటున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతోందని ఈసీడీసీ డైరెక్టర్‌ ఆండ్రియా అమ్మోన్ తెలిపారు.

బ్రిటన్‌లో ఒమిక్రాన్‌  విలయం: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బ్రిటన్‌లో విలయం సృష్టిస్తున్నది. ఒకే రోజు 101 కొత్త కేసులు రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్‌ ఆరోగ్య అధికారులు మంగళవారం తెలిపారు. కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కొవిడ్‌ పరిస్థితులపై మంత్రులతో సమీక్షించారు. వైరస్‌ కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టాలని నిపుణులు సూచించారు.

కొత్త వేరియంట్ రాకతో దేశంలో థర్డ్ వేవ్‌ గుబులు, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, ఇప్పటివరకు 23 మందికి సోకిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్, ఒమిక్రాన్‌ కేసులు నమోదైన ప్రధాన దేశాలు ఇవే

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో కొత్తగా 45,691 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,560,341కు చేరింది. మరో 180 కరోనా మరణాలు రికార్డవగా.. మొత్తం సంఖ్య 1,45,826కు చేరింది. బ్రిటన్‌లో 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున వారిలో దాదాపు 89శాతం మంది మొదటి డోసు టీకా తీసుకున్నారు. 81శాతం కంటే ఎక్కువ మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు.

ప్రస్తుతం ఉన్న డేటా సరిపోదని తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ

మరో వైపు కరోనా కొత్త వేరియంట్‌ తీవ్రతను అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉన్న డేటా సరిపోదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అయితే, డెల్టా వేరియంట్‌ కంటే తీవ్రమైన ప్రభావం చూపడం లేదని తెలిపింది. డబ్ల్యూహెచ్‌కు చెందిన ఎమర్జెన్సీ మెడిసిన్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ.. వేరియంట్‌ వేగంగా విస్తరించిన.. తీవ్రత తక్కువగానే ఉన్నదని ప్రాథమిక డేటా చూపుతుందన్నారు. ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. గతంలో అగ్రరాజ్యం సహా పలు దేశాలను వణికించిన డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ వేగంగా వ్యాపించే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరికలు చేశారు. దీంతో ప్రపంచ దేశాలు మరింత కలవరపడుతున్నాయి.

తమ దేశంలో కొత్తరకం ‘ఒమిక్రాన్’ వేరియంట్ : క్వీన్స్‌ల్యాండ్‌ ఆరోగ్య మంత్రి 

ప్రపంచానికి మరో షాకింగ్ వార్త తెలిసింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ ఆరోగ్య మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. తమ దేశంలో కొత్తరకం ‘ఒమిక్రాన్’ వేరియంట్ వెలుగు చూసిందని క్వీన్స్‌ల్యాండ్ ఆరోగ్యం, అంబులెన్సు సేవల శాఖ మంత్రి వైవెట్టా డియాత్ వెల్లడించారు. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. ‘ఒక కొత్త రకం ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు చెప్పడం కోసమే ఇక్కడ నేను నిలుచున్నా. ప్రపంచంలో ఈ కొత్తరకం వేరియంట్ కనిపించడం ఇదే తొలిసారి’ అని ఆమె ప్రకటించారు. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల ఆస్ట్రేలియాకు వచ్చిన వ్యక్తిలో ఈ వేరియంట్ కనిపించినట్లు తెలియజేశారు.

ఒమిక్రాన్ వేరియంట్‌పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కీల‌క అంశాన్ని వెల్ల‌డించారు. గ‌త వేరియంట్ల క‌న్నా ఒమిక్రాన్ విధ్వంస‌క‌ర‌మైంది ఏమీకాద‌న్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విష‌యం నిజ‌మే అని, అది డెల్టా క‌న్నా వేగంగా విస్త‌రిస్తోంద‌ని, కానీ డెల్టా క‌న్నా ఒమిక్రాన్ ప్ర‌మాద‌క‌ర‌మైంది ఏమీ కాదు అని ఫౌసీ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా ప‌నిచేస్తాయ‌న్న దానిపై ల్యాబ్‌లో ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని, వాటి ఫ‌లితాలు మ‌రికొన్ని రోజుల్లో వ‌స్తాయ‌ని ఫౌసీ చెప్పారు.

క‌రోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్‌తో వ్యాక్సిన్ వేసుకోని వారికి, పిల్ల‌ల‌కు ముప్పు పొంచి ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ డాక్ట‌ర్ సౌమ్య స్వామినాథ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ మూడురెట్లు వ్యాప్తి చెంద‌గ‌ల శ‌క్తి క‌లిగి ఉంద‌న్నారు. తొలిసారి వైర‌స్ సోకిన వారికి 90 రోజుల త‌ర్వాత రీ ఇన్‌ఫెక్ష‌న్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ అని చెప్పారు.

బ్రిటన్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్, 160కి పైగా కేసులు నమోదు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు, ఎవరొచ్చినా క్వారంటైన్‌లో ఉండాలన్న బ్రిటన్ ప్రధాని

ప్రారంభంలో ఒమిక్రాన్ ఇన్‌ఫెక్ష‌న్ ల‌క్ష‌ణాల‌ను క‌నిపెట్ట‌డం సాధ్యం కాద‌ని, కేసుల సంఖ్య పెరుగుద‌ల‌, ద‌వాఖాన‌లో చేరుతున్న వారి సంఖ్య‌కు మ‌ధ్య స‌మ‌యం ఉంటుంద‌ని సౌమ్య స్వామినాధ‌న్ అన్నారు. ద‌వాఖాన‌ల్లో చేరుతున్న వారిలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర‌త‌ను అంచ‌నా వేయ‌డానికి మ‌నం త‌ప్ప‌నిస‌రిగా రెండు నుంచి మూడు వారాలు వేచి చూడాల్సి ఉంద‌న్నారు. పిల్ల‌ల‌పై ఒమిక్రాన్ ప్ర‌భావం చూపుతున్న తీరుపై డేటా కోసం వేచి చూస్తున్నామ‌ని చెప్పారు.