Newdelhi, Oct 8: వరుస భూకంపాలతో (Earthquake) అఫ్ఘనిస్థాన్ (Afghanistan) ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. హెరాత్ ప్రావిన్స్ లో కేవలం గంట వ్యవధిలో ఆరు భూకంపాలు సంభవించాయి. తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఆ తర్వాత వరుసగా 5.5, 4.7, 6.3, 5.9, 4.6 తీవ్రతతో భూకంపాలు కుదిపేశాయి. భూకంప కేంద్రం హెరాత్ నగరానికి సమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. వరుస భూకంపాలతో స్థానికంగా పలు భవనాలు బీటలు వారాయి. ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వీధుల్లోకి వచ్చి నిలబడిపోయారు. భూకంపాల బారిన పడి మొత్తం 2000 మంది మరణించినట్టు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరో 5000 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నాయి. భూకంపంధాటికి ఏకంగా డజనుకు పైగా గ్రామాలు నేలమట్టమయ్యాయి.
Over 320 Killed, 12 Villages Entirely Destroyed In Afghanistan Earthquake https://t.co/AhvMBD4KcY pic.twitter.com/ZMuGX7NbVv
— NDTV (@ndtv) October 8, 2023
ఈ దేశాల్లో కూడా..
పపువా న్యూగినియాలో కూడా రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. మెక్సికో, నేపాల్ లో కూడా భూకంపాలు కలకలం సృష్టించాయి. అయితే, నేపాల్‌లో కొన్ని భవంతులకు నష్టం వాటిల్లినా ప్రాణనష్టం మాత్రం సంభవించలేదు.