Turkey Earthquake. (Photo Credits: Twitter@DDNewslive)

Turkey, FEB 08: ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా అతలాకుతలమవుతున్నాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. టర్కీ, సిరియాలో భూప్రకంపనలు (Syria Earthquake ) ఆగడం లేదు. రెండు దేశాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. వేలాది భనాలు కుప్పకూలాయి. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 7,800 దాటింది (7,800 Killed). శిథిలాల తొలగింపులో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణ నష్టం 20 వేలకు పైగా ఉండొచ్చని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. భూకంపం ధాటికి ఏ శిథిలాన్ని కదిలించినా డెడ్ బాడీలే. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భూకంపంతో (Turkey Earthquake) ఇరు దేశాలు మరణ మృదంగం మోగుతోంది.

Earthquake in Turkey: టర్కీలో 3 నెలల పాటు అత్యవసర పరిస్థితి, 10 దక్షిణ ప్రావిన్సులలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, దాదాపు 5 వేల మందిని బలిగొన్న భయంకరమైన భూకంపాలు 

భూకంపం తీవ్రతకు వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంపం దాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 7,800లకు పైగా మంది మృత్యువాత పడగా, వేలాదిగా ప్రజలు గాయపడ్డారు. మరోవైపు టర్కీలో (Turkey) వరుస భూప్రకంపనలతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. టర్కీ, సిరియాలో ఎటు చూసిన కూలి పోయిన బిల్డింగుల్లే దర్శనమిస్తున్నాయి. రెండు దేశాల్లోని ప్రాంతాలు శవాల దిబ్బగా మారింది. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Syria Earthquake: భూకంపానికి సిరియా జైలు ధ్వంసం, శిక్ష అనుభ‌విస్తున్న 20 మంది జీహాదీలు పరార్, రాజో జైలు జిహాదీలు ప‌రారీ అయ్యారని తెలిపిన అధికారులు 

శిథిలాలు తొలగించే కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని, 10 వేలు దాట వచ్చని యూఎన్ జియోలాజికల్ సర్వే చెబుతోంది. టర్కీ, సిరియా సరిహద్దుల్లో మొన్న, నిన్న వరుస భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల ధాటికి నగరాల్లోని పలు అపార్ట్ మెంట్లు కుప్పకూలాయి. శిథిలాల కింద వేలాది మంది జనం చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగతుున్నాయి. రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. భూకంపాల్లో వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. టర్కీలోని పలు నగరాలపై భూకంప ప్రభావం పడింది.