పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అడ్ల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది.పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష‍్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందారని.. మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని పాక్ తెలిపింది.
అయితే ఈ దాడుల్ని పాక్ తీవ్రంగా ఖండించింది. తమ గగనతలంలో ఇరాన్ చేపట్టిన ఈ చర్యను పాక్ ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. 2023 డిసెంబర్లో ఇరాన్‌లోని పోలీస్ స్టేషన్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన పాకిస్థాన్‌ను ఇరాన్ మందలించింది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని రాస్క్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. అదేవిధంగా పాకిస్థాన్‌కు తన సరిహద్దులపై నియంత్రణ లేదని విమర్శించింది.
Here's News
Pakistan condemns alleged violation of its airspace by Iran that resulted in the killing of two children.
It claimed that the attack was unprovoked and a protest had been lodged with Iran.
Iranian charge d'affaires was also called in to condemn the attack pic.twitter.com/uTmf7T4iQ3
— News Print (@News_Print_Info) January 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)