గత వారం పాపువా న్యూ గినియాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో 2,000 మందికి పైగా సజీవ సమాధి అయ్యారని జాతీయ విపత్తు కేంద్రం సోమవారం తెలిపింది. దేశంలోని ఉత్తరాన ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామం చుట్టూ ఖననం చేయబడిన వారి సంఖ్య శుక్రవారం కొండచరియలు విరిగిపడినప్పటి నుండి క్రమంగా పెరుగుతున్నట్లుగా స్థానిక అధికారులు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
ఆదివారం నాడు 670 మందికి పైగా మరణించినట్లు UN ఏజెన్సీ అంచనా వేసింది. జాతీయ విపత్తు కేంద్రం ఆదివారం ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో డెత్ టోల్‌ను మళ్లీ 2,000కి పెంచింది, అది సోమవారం బహిరంగంగా విడుదల చేయబడింది. కొండచరియలు విరిగిపడటం వల్ల భవనాలు మరియు ఫుడ్ గార్డెన్‌లు కూడా భారీగా ధ్వంసం అయ్యాయని తెలిపింది.ఆ ప్రాంతమంతా భౌగోళిక అస్థిరత్వం ఉండటం, సమీపంలో గిరిజనుల ఘర్షణలు జరుగుతున్న కారణంగా సహాయకచర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎంగా ప్రావిన్స్‌లోని ఎంబాలి గ్రామంలో శుక్రవారం కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే.
పపువా న్యూగినియాలో భారీ భూకంపం, ఆస్ట్రేలియాకు సునామీ ముప్పు లేదని ప్రకటించిన నిపుణులు
ప్రభావిత ప్రాంతానికి సమీపంలో దాదాపు 4,000 మంది ప్రజలు నివసిస్తున్నారని కేర్ ఇంటర్నేషనల్ PNG కంట్రీ డైరెక్టర్ జస్టిన్ మెక్‌మాన్ సోమవారం ABC టెలివిజన్‌తో చెప్పారు. కానీ PNG యొక్క చివరి విశ్వసనీయ జనాభా గణన 2000లో జరిగినందున స్థానిక జనాభా యొక్క ఖచ్చితమైన అంచనాను పొందడం కష్టమని అధికారులు చెబుతున్నారు. చాలా మంది ప్రజలు మారుమూల పర్వత గ్రామాలలో నివసిస్తున్నారు. 2024లో జనాభా గణనను నిర్వహించనున్నట్లు దేశం ఇటీవల ప్రకటించింది. పపువా న్యూగినియాలో భారీ భూకంపం, మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించిన యూఎస్ జియోలాజికల్ సర్వే
ఘటన జరిగిన ప్రాంతంలో భౌగోళిక అస్థిరత్వం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతం సుదూరాన ఉండటం మరో ప్రధాన అడ్డంకిగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులే రంగంలోకి దిగి క్షతగాత్రులను వెలికి తీసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పలుగు, పారలతో కొండచరియలను తవ్వుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విపత్తు కారణంగా ఇప్పటివరకూ 1250 మంది నిరాశ్రయులుగా మారారు. 150 ఇళ్లు సజీవ సమాధి కాగా మరో 250 ఇళ్లు నివాసయోగ్యం కాకపోవడంతో ప్రజలు వాటిని విడిచి వెళ్లిపోయారు. విరిగిపడ్డ కొండచరియలను తొలగించడం ప్రస్తుతం ఎంతో రిస్క్ తో కూడుకున్న పని అని ఐక్యరాజ్య సమితి అధికారులు తెలిపారు.