పాకిస్థాన్ మాజీ అధ్య‌క్షుడు జ‌ర‌న‌ల్ ప‌ర్వేజ్ ముషార్ర‌ఫ్ ఆరోగ్యం విష‌మించింది. ప్ర‌స్తుతం యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆయ‌న‌కు వైద్యులు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు.ఇదిలా ఉంటే... శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ముషార్ర‌ఫ్ చ‌నిపోయారంటూ వార్త‌లు వెలువ‌డ్డాయి. పాకిస్థాన్‌కు చెందిన వ‌క్త్ న్యూస్ అనే మీడియా సంస్థ ముషార్ర‌ఫ్ చ‌నిపోయారంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. అయితే ఈ వార్త‌లు అబ‌ద్ధ‌మంటూ ఇత‌ర మీడియా సంస్థ‌లు వెల్ల‌డించ‌గా... వ‌క్త్ న్యూస్ స‌ద‌రు ట్వీట్‌ను తొల‌గించింది.

1943 ఆగ‌స్టు 11న‌ ఢిల్లీలోనే జ‌న్మించిన ముషార్ర‌ఫ్ దేశ విభ‌జ‌న స‌మ‌యంలో త‌న కుటుంబంతో క‌లిసి పాకిస్థాన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత పాకిస్థాన్ సైన్యంలో చేరిన ముషార్ర‌ఫ్ సుదీర్ఘ కాలం పాటు సేవ‌లందించారు. 1998 నుంచి 2007 దాకా పాక్ ఆర్మీ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ముషార్ర‌ఫ్.. 1999 నుంచి 2002 దాకా పాక్ ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఇటు పాక్ ఆర్మీ చీఫ్ ప‌ద‌వితో పాటు ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే ముషార్ర‌ఫ్ అప్ప‌టి ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి అధ్య‌క్ష ప‌ద‌విని చేజిక్కించుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న 2001 పాక్ అధ్య‌క్ష ప‌ద‌విని లాగేసుకున్నారు. 2008 వ‌ర‌కు ఆయ‌న పాక్ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)