Polar plunge in US: అమెరికాలో మంచు తుఫాను కల్లోలం, ప్రమాదంలో 15 కోట్ల మంది అమెరికన్లు, మ‌రోసారి విరుచుకుప‌డే అవ‌కాశాలు, నేషనల్‌ గార్డ్‌ సాయం కోరిన టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌, ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్
Snowstorm Gail pics (Photo Credits: Twitter/MarcusBastille, karldpeterson)

Texas, Feb 17: అమెరికాలో మంచు తుఫాన్ క‌ల‌కలం సృష్టిస్తున్న‌ది. దక్షిణాది రాష్ట్రాలను మంచు ముంచేస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో (Polar plunge in US) జనజీవనం అస్తవ్యస్తం కాగా పలు విమానాలను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి వీల్లేకుండా రహదారులన్నీ మంచుతో కప్పేసి ఉన్నాయి. దాదాపుగా 15 కోట్ల మంది అమెరికన్లకి మంచు ముప్పులో (Frigid Arctic Air) ఉన్నట్టుగా ది నేషనల్‌ వెదర్‌ సర్వీసెస్‌ హెచ్చరించింది.

టెక్సాస్‌ చుట్టుపక్కల రాష్ట్రాల్లో 40 లక్షల మందికిపైగా అమెరికన్లు నీళ్లు, కరెంట్‌ లేక అల్లాడిపోతున్నారు. టెక్సాస్, అలబామా, ఒరెగాన్, ఒక్లహోమా, కాన్సస్, కెంటకీ, మిసిసిపీ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. టెక్సాస్‌లో పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. విద్యుత్‌ ప్లాంట్లు సరిగా పని చేయడం లేదు. పైపుల్లో నీరు గడ్డ కట్టుకపోవడంతో ప్రజలు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తుకు ఎక్కువ డిమాండ్ ఏర్ప‌డింది. దాంతో అక్క‌డ ప‌వ‌ర్ క‌ట్స్ మొద‌ల‌య్యాయి. మంచు తుఫాన్ మ‌రోసారి విరుచుకుప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

15 కోట్ల మంది అమెరిక‌న్లకు వింట‌ర్ స్ట్రామ్ హెచ్చ‌రిక చేశారు. తీవ్ర‌మైన మంచు తుఫాన్ వ‌ల్ల ఇప్పటి వ‌ర‌కు 11 మంది మృతి చెందారు. టెన్నిసి, టెక్సాస్‌, కెంట‌కీ, లూసియానాల్లో ఈ మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఈ నేపథ్యంలో టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌ నేషనల్‌ గార్డ్‌ సాయం కోరారు. కన్సాస్‌ గవర్నర్‌ కరెంట్‌ పొదుపుగా వాడుకోవాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఇక కెంటకీలో మరింత బలంగా చలి గాలులు (Winter Weather Causes) వీచే అవకాశం ఉండడంతో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలన్నీ పాటించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

లేటు వయసులో అమెరికాను ఏలిన నేతలు గురించి తెలుసుకుందామా

ఇప్పటికీ 27 లక్షల మందికిపైగా ప్రజలు చీకట్లోనే మగ్గిపోతున్నారు. లూసియానా, డల్లాస్‌ రాష్ట్రాల్లోనూ మంచు బీభత్సం నెలకొంది. ఆర్కిటిక్‌ నుంచి వీస్తున్న బలమైన చలిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నార్త్‌ కరోలినాలో టోర్నడోలకు ముగ్గురు మరణించారు.నార్త్ క‌రోలినాలో టోర్న‌డో బీభ‌త్సం సృష్టించింది. దాని వ‌ల్ల ముగ్గురు మృతిచెందారు. ప‌ది మంది గాయ‌ప‌డ్డారు. అక్క‌డ రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతున్న‌ట్లు అధికారులు చెప్పారు.

అమెరికాలో సుమారు 73 శాతం స్నో క‌ప్పుకున్న‌ట్లు నేష‌న‌ల్ వెద‌ర్ స‌ర్వీస్ పేర్కొన్న‌ది. మెక్సికోలోని ఉత్త‌రాది, మ‌ధ్య ప్రాంతాల‌కూ అతిశీత‌ల తుఫాన్ చేరుకున్న‌ది. దీంతో అక్క‌డ కూడా రెండ‌వ రోజు వ‌రుస‌గా విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. పైప్‌లైన్లు గ‌డ్డ‌క‌ట్టుకుపోవ‌డంతో.. స‌హ‌జ‌వాయువు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. గ‌త 30 ఏళ్ల‌లో ఎన్న‌డూ చూడ‌ని శీత‌ల ఉష్ణోగ్ర‌త‌లు టెక్సాస్‌లో న‌మోదు అయ్యాయి. ఆదివారం రోజున టెక్సాస్‌లో మైన‌స్ 18 డిగ్రీలు న‌మోదు అయ్యింది.

అరవై దేశాలకు పాకిన యుకె కరోనావైరస్, 23 దేశాలకు పాకిన దక్షిణాఫ్రికా రకం కరోనావైరస్, వారంలోనే 47 లక్షల కరోనా కేసులు, కొవిడ్ వారపు నివేదికను విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఆ రాష్ట్రంలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు అధ్య‌క్షుడు బైడెన్ తెలిపారు. విద్యుత్తుకు డిమాండ్ పెర‌గ‌డంతో.. ప‌వ‌ర్ గ్రిడ్ విఫ‌ల‌మైంది. అన్ని ప్రాంతాల్లో కురుస్తున్న మంచు వ‌ల్ల రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. హూస్ట‌న్‌లో ఒక్క ఆదివారం రోజునే వంద‌ల సంఖ్య‌లో ట్రాఫిక్ ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఓక్ల‌హామా సిటీలో మంచు వ‌ల్ల ప‌దుల సంఖ్య‌లో లారీలు త‌గ‌ల‌బ‌డ్డాయి.