Thai YouTuber Scam: ఫాలోవర్స్‌ను రూ. 437 కోట్లు మోసం చేసిన యూట్యూబర్, విదేశీ మారకం పేరుతో ఫ్యాన్స్ కు కుచ్చుటోపి, పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టిన వేలాది మంది బాధితులు

Thailand, AUG 31: తన డ్యాన్సులతో యూట్యూబ్‌ను (Youtube) ఇరగదీసింది. ఫాలోవర్ల సంఖ్యను అమాంతం పెంచేసుకున్నది. తాను చెప్పినట్లు వినడంతో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను నిలువునా ముంచింది. విదేశీ మారకం పేరుతో వారికి కుచ్చుటోపీ పెట్టింది. పెద్ద సంఖ్యలో బాధితులు పోలీసు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. మోసపోయిన మొత్తం భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437 కోట్లుగా ఉన్నది. వివరాల్లోకెళితే..థాయిలాండ్‌కు (Thailand) చెందిన యూట్యూబ్‌ స్టార్‌ (YouTuber) నత్తమోన్‌ ఖోంగ్‌చక్‌ (Natthamon Khongchak) తన డ్యాన్సులతో అభిమానులను కట్టిపడేస్తున్నది. నట్టి అని ముద్దుగా పిలుచుకునే నత్తమోన్‌ ఖోంగ్‌చక్‌ (Natthamon Khongchak).. తక్కువ సమయంలో యూట్యూబ్‌ మహారాణిగా వెలిగిపోయింది. వేల సంఖ్యలో ఫాలోవర్లు వచ్చారు. ఆమె చేసే ప్రతీ డ్యాన్సను ఆహా..! ఓహో..! అంటూ మెచ్చుకుంటూ ఆకాశానికెత్తేశారు. ఇమెకు ఇప్పటికే 8.47 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే యూట్యూబ్‌లో ఆమె ఛానల్‌కున్న పాపులారిటీ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (Instagram) ఔత్సాహిక స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారుల కోసం ప్రైవేట్ కోర్సులకు ప్రచారం కూడా చేపట్టింది. తాను సాధించిన లాభాలను సైతం పోస్ట్ చేసింది.

Iraq Political Crisis: ఇరాక్‌లో రాజకీయ సంక్షోభం, నిరసనలతో రణరంగాన్ని తలపిస్తున్న రాజధాని బాగ్ధాద్, సైన్యం జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి 

తాను, తన డ్యాన్సులంటే పడిచస్తున్న అభిమానులు, ఫాలోవర్లతో పెట్టుబడులు పెట్టించాలని యోచించిన నట్టి.. విదేశీ మారకంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఇస్తానని నమ్మబలికింది. దాంతో 35 శాతం రాబడుల వాగ్ధానం మేరకు దాదాపు 6 వేల మంది ఫాలోవర్స్‌ ఆమె చెప్పినట్లుగా పెట్టుబడి పెట్టారు. అయితే, ఎంతకు లాభాలు పంచకపోవడంతో ఫాలోవర్స్‌లో అనుమానం మొదలైంది. దాంతో వారు థాయ్‌ పోలీసులను ఆశ్రయించి నట్టిపై కేసు పెట్టారు. పెద్ద సంఖ్యలో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Monkeypox in US: అమెరికాలో మంకీపాక్స్ కల్లోలం, 17 వేలకు చేరిన పాజిటివ్ కేసులు, న్యూయార్క్‌లో అత్య‌ధికంగా 3,124 పాజిటివ్ కేసులు 

కాగా, పెట్టుబడిదారులకు దాదాపు 1 బిలియన్‌ భాట్‌ మేర (27.5 మిలియన్‌ డాలర్లు) బకాయిపడినట్లు చివరిసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో నట్టి పేస్ట్‌ పెట్టింది. బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యక్తి తన ఖాతాలను, నిధులను గత మార్చి నుంచి బ్లాక్‌ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని నట్టి పేర్కొన్నది. తన ఫాలోయర్లను మోసం చేయడం తన ఉద్దేశం కాదని, వారికి త్వరలోనే వారి పెట్టుబడులను తిరిగి ఇచ్చేస్తానని నట్టి హామీ ఇస్తుంది. ఇలాఉండగా, నట్టిని అరెస్ట్‌ చేసేందుకు థాయిలాండ్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో వారంట్‌ జారీ చేసింది. ఇప్పటివరకు 102 మంది ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.