ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తాజాగా తన గగనతలాన్ని బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌కి మూసేసింది. అలాగే రష్యా విమానాశ్రయాల్లో బ్రిటన్ విమానాల ల్యాండింగ్‌ను నిషేధించింది. రష్యా పౌర విమానయాన సంస్థ ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘యూకేలో రిజిస్టర్ అయిన లేదా ఆ దేశంతో సంబంధం ఉన్న, లీజు ఒప్పందం ఉన్న విమానాలు రష్యా గగనతలాన్ని, ఎయిర్‌పోర్టులను వినియోగించడంపై ఆంక్షలు అమలు చేస్తున్నాం’ అని రోసావియాట్సియా ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి ఈ నిషేధం అమలవుతుందని పేర్కొంది. యూకే ఏవియేషన్ అథారిటీ అననుకూల నిర్ణయాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది.
Russia closes its airspace to British airlines https://t.co/hxlHvC7J9t pic.twitter.com/ZchHS4YUnU
— Reuters (@Reuters) February 25, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)